Ennenno Janmala Bandham : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో వేద ఎమోషనల్ అవుతూ ఉండగా ఖుషి అక్కడికి వస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో ఖుషి అక్కడికి రావడంతో వేద తన బాధను మొత్తం మర్చిపోయి ఖుషితో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. మరొకవైపు యష్, ఇంటికి వెళుతూ ఉండగా అభిమన్యు ఎదురుపడతాడు. అప్పుడు యష్ కి మాల దగ్గరికి మధ్య సంబంధం ఉన్నట్లుగా అభిమన్యు మాట్లాడడంతో యష్ అలాంటిదేమీ లేదు అని సీరియస్ అవుతాడు. కేవలం ఆది కోసం మాత్రమే మాళవికతో మాట్లాడుతున్నాను అని అనడంతో అభిమన్యు నవ్వుకుంటూ ఉంటాడు.
అప్పుడు అభిమన్యు కి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోతాడు యష్. మరొకవైపు మాలిని, రత్నం అందరూ యష్ మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరొకవైపు యష్ ఇంటికి వస్తూ వేద గురించి తలచుకొని ఆలోచిస్తూ ఉంటాడు. మరోవైపు వేద ఫుల్ ఎమోషనల్ అవుతూ ఉంటుంది. జరిగిన విషయాలు తలచుకొని మరింత బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే యష్ ఇంటికి రావడంతో మాలిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు రత్నం యష్ ఇప్పుడే మాకు అసలు విషయం తెలిసింది నువ్వు అక్కడ ఎందుకు ఉన్నావు అని నిలదీస్తాడు. అప్పుడు మాలిని కోపంతో ఆ మాళవిక గురించి తెలిసి కూడా ఎందుకు ఇలా చేశావు అని నిలదీస్తుంది. ఇంతలోనే అక్కడికి వేద వస్తుంది. వేదాకు నీకు మధ్య చిచ్చు పెట్టాలనే దాని కుట్ర అది నీకు అర్థం కాలేదా యష్ అని కోపంతో అరుస్తూ ఉంటుంది మాలని. మనం ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నాము అంటే కారణం ఎవరో తెలుసు కదా వేద అని వేదాని పొగుడుతూ ఉంటుంది మాలిని.
Ennenno Janmala Bandham : మాలిని షాక్..
అప్పుడు యష్ ఏమి మాట్లాడకుండా మాలిని మాటలకు ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నీ కూతురు ఖుషి కి నవ్వులు గిఫ్టుగా ఇస్తే నువ్వు వేదాకి కన్నీళ్లు గిఫ్ట్ గా ఇస్తున్నావ్ కరెక్టేనా అని నిలదీస్తుంది మాలిని. అప్పుడు మాలిని నిన్ను తల్లిగా నిలదీసే హక్కు నాకు ఉంది అనడంతో లేదు అత్తయ్య అని అంటుంది వేద. ఆయన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు అని అనటంతో మాలిని షాక్ అవుతుంది. ఆ తర్వాత యష్ ని పిలుచుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది వేద.
మరొకవైపు అభి, మాళవిక దగ్గరికి వెళ్లి హెల్త్ కండిషన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మాళవిక అసలు విషయాలు చెప్పడంతో అభిమన్యు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు మాళవిక అభిమన్యు మాటలకు నేను బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను భార్యను కాదు. మనమధ్య భార్యాభర్తల బంధం లేదు అని అంటుంది. మరొకవైపు యష్ ఫ్రెష్ అయ్యి రాగా ఇంతలో వేద అక్కడికి భోజనం తీసుకొని వస్తుంది.
మరోవైపు మాళవిక అభిమన్యుతో యష్ గురించి గొప్పగా చెబుతూ ఉండడంతో అభిమన్యు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మాళవిక మాటలకు అభిమన్యు నీకు అసలైన అభిమన్యు తెలియదు బలైపోతావు అని అనుకుంటూ ఉంటాడు. మరొకవైపు మాలిని వేద చేసిన పనికి సంతోషంతో మాట్లాడుతూ ఉంటుంది. యష్ వేదతో మాట్లాడాలి అని ప్రయత్నిస్తూ ఉండగా వేద మాత్రం ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుందీ. అప్పుడు యష్ ని జరిగిన విషయాల గురించి నిలదీస్తుంది వేద.
Tufan9 Telugu News And Updates Breaking News All over World