Hero balakrishna: ఇంద్ర సినిమా ఘన విజయం సాధించి రాయలసీమ పౌరుషాన్ని ప్రపంచానికి సాటిన రోజులు అవి. ఆ సమయంలో ఒక ఫ్యాక్షన్ సినిమా వచ్చిందంటే చాలు జనాల్లో ఏదో ఒక తెలియని క్యూరియాసిటీ. ఇంద్ర సినిమా ఘన విజయం సాధించడంతో మరో యాక్షన్ తో కూడిన సినిమా తీయాలని బాలకృష్ణ వివి.వినాయక్ ను కోరారు. అప్పటికే ఆది లాంటి ఓ సినిమా తీసిన ఆయన.. చిరంజీవి ఇంద్ర సినిమాను మించేలా మరో సినిమా తీస్తాడని బాలయ్య బాబు గట్టిగా నమ్మారు.
అనుకున్నదే తడవుగా సినిమాకి చెన్నకేశవ రెడ్డి పేరు కూడా పెట్టేశారు. అంతేకాదు రిలీజ్ డేట్ కూడా ముందే అనౌన్స్ చేశారు. ఈ సినిమా పేరుతోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. కచ్చితంగా ఇంద్రను మించిన హిట్ అవుతుందని అందరూ భావించారు. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ కూడా ఉండడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. తండ్రి పాత్రలో బాలకృష్ణకు జోడీగా హీరోయిన్ టబును తీస్కున్నారు.
అయితే టబు నటించిన పాత్ర కోసం ఆమె కన్నా ముందు సౌందర్యని అనుకున్నారు. కానీ సౌందరయ్ అప్పటికే సౌందర్య నటించి పది సినిమాలకు వివి వినాయక్ అసిస్టెంట్ డైరక్టర్ గా పని చేశారు. ఆ పరిచయంతోనే బెంగళూరుకు వెళ్లి మరీ కథను వినిపించారు. కానీ అప్పటికే హీరోయిన్ గా ఇంకా మంచి స్థాయిలో ఉన్న సౌందరయ్ రిస్క్ తీస్కోవడానికి ఒప్పుకోలేదు ఇప్పడు ఏజ్ డు క్యారెక్టర్ లో చేయలేనని వివరించిందట. అలా సౌందర్య బాలయ్య బాబుతో కలిసి నటించలేకపోయింది.