Hero Balakrishna: నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అసరం లేదు. అయితే బాలకృష్ణ మేనేజర్ గా బాధ్యతలు నిర్వహించేందుకు ఆయన చిన్న కుమార్తె తేజస్విని రంగంలోకి దిగిందట. ఇప్పటి వరకు బాలయ్య కాల్ షీట్స్, షూటింగ్స్ లాంటి వ్యవహారాలన్నీ వేరే వ్యక్తి చూసుకుంటున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య తన కూతురు తేజస్వినిని మేనేజర్ గా నియమించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
తేజస్విని గీతం గ్పూర్ ఛైర్మన్ భరత్ ని వివాహం చేస్కున్న సంగతి తెలిసింది. తండ్రి మీద మమకారంతో తేజస్విని ఆయన సినిమాల వ్యవహారాలు చూసుకునేందుకు ఇష్టపడిందట. గతంలో బాలయ్య సినిమాకు సంబంధించి ఫైనాన్షియల్ వ్యవహారాలు ఆయన సతీమణి వసుంధర చూసుకునేవారని టాక్. ఇప్పుడు బాలయ్య కాస్ట్యూమ్స్, కాల్షీట్లు, ఫైనాన్షియల్ వ్యవహారాలన్నీ తేజస్విని చూసుకుంటోందని ఇండస్ట్రీలో టాక్.
అందువల్లే తేజ్విని తరచుగూ షూటింగ్ లొకేషన్స్ కి వెళ్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్యకి అప్పుడప్పుడు సిగరెట్, స్మోకింగ్ చేసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేజస్విని తరచుగా షూటింగ్స్ వెళ్తుండటంతో కుమార్తె ఇబ్బంది పడకూడదని బాలయ్య స్మోకింగ్ మానేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి కూతురే తండ్రితో ఆ అలవాటు మాన్పించిందా.. లేక బాలయ్యే కూతురు ఇబ్బంది పడకూడదని త్యాగం చేశారా అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది.