VV Vinayak: ఆది సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ ప్రారంభించిన వీవీ వినాయక్ ఆ తర్వాత వెంటనే నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి సినిమా తీశారు. ఇందులో బాలయ్య డ్యూయల్ రోల్ లో అదరగొట్టేశారు ముఖ్యంగా ఇందులోని డైలాగ్ లు అభిమానులను తెగ మెప్పించాయి. సత్తిరెడ్డి అనగానే భూమిలో నుంచి వచ్చే కార్ల సీన్ ను ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. హీరోయిన్లుగా స్రియా, టబు యాక్టింగ్ ఇరగదీశారు. మణిశర్మ మ్యూజిక్, వీవీ వినాయక్ మేకింగ్ సూపర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకి అభిమానల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. కానీ బాక్సాఫీసు వద్ద మాత్రం విజయం సాధించలేకపోయింది.
తాజాడా వీవీ వినాయక్ నాటి విషయాలను అభిమానలతో పంచుకున్నారు. ఈ సినిమాలో టబు గారు చేసిన క్యారెక్టర్ కు ముందుగా సౌందర్య గారిని అనుకున్నానం అని వివరించారు. బెంగుళూర్ కు వెళ్లి స్టోరీ కూడా చెప్పినట్లు తెలిపారు. ఇందులో యంగ్, ఓల్డ్ రెండు పాత్రలు ఉంటాయన్నారు. కానీ అప్పుడే ఓల్డ్ క్యారెక్టర్లు వద్ద వినయ్ గారు అని చెప్పినట్లు పేర్కొన్నారు. మళఅలీ ఓల్డ్ లోకి వెళ్లిపోతామని తనతో అన్నట్లు తెలిపారు. నేను అప్పటికే అసిస్టెంట్ డైరెక్టర్ గా సౌందర్యతో నాలుగైదు సినిమాలు చేశానని అన్నారు.