Wedding Dance : ట్రెండ్ అంటే ఇదే.. రోజులు మారాయి.. అమ్మాయిలు మారారు. ఒకప్పటిలా కాకుండా తమ టాలెంట్ బయటపెడుతున్నారు. అందుకు పెళ్లిని వేదికగా ఎంచుకుంటున్నారు. పెళ్లి రోజున తీన్ మార్ డ్యాన్సులతో రచ్చరచ్చ చేస్తున్నారు. పెళ్లికూతుళ్లు మాత్రమే కాదు.. పెళ్లిలో బంధువులు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఊర మాస్ డ్యాన్సులతో అదరగొట్టుస్తున్నారు. పెళ్లి అనగానే.. డీజే.. డ్యాన్సులు ఇదే ట్రెండ్ అంటున్నారు. కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు.
పెళ్లిపీటలెక్కగానే వధువరులు ఇద్దరు కలిసి డ్యాన్సులు చేస్తూ సందడి చేస్తున్నారు. సినిమా పాటల ట్రెండ్ కు తగినట్టుగా డ్యాన్సులతో దుమ్ములేపుతున్నారు. ఎప్పుడో బుల్లెట్టు బండెక్కి అంటూ పెళ్లికూతురు తన భర్తను ఊహించుకుంటూ పాడుతూ డ్యాన్స్ వేస్తుంది. ఇప్పుడు ఇలాంటి పాటలే ఫుల్ పాపులర్ అవుతున్నాయి. ఇప్పడు చాలామంది అమ్మాయిలూ తమ పెళ్లి అప్పుడు ఈ పాటలకే స్టెప్పులు వేస్తూ సందడి చేస్తున్నారు. పెళ్లి వేడుకల్లో డీజీ ఉంటే ఆ సందడే వేరబ్బా.. అందుకే పెళ్లి మండపాల్లో డ్యాన్సులు చేస్తూ వధువరులు ఎంజాయ్ చేస్తున్నారు.
పెళ్లిళ్లు డ్యాన్సులతో సందడిగా మారిపోతున్నాయి. పెళ్లి సమయంలో డ్యాన్సులు వేయడం.. ఆ వీడియోలను రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తమ వీడియోలకు వచ్చిన వ్యూస్, లైక్స్ చూసి తెగ ముచ్చటపడిపోతున్నారు. ఇప్పుడా పెళ్లికూతుళ్ల డ్యాన్సుల వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు కూడా ఓ వీడియో నెట్టింట్లో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఇద్దరు కలిసి తీన్ మార్ స్టెప్పులతో అదరగొట్టేశారు. మరో పెళ్లి కూతురు కూడా తన బంధువులతో కలిసి ఊర మాస్ డ్యాన్స్ స్టెప్పులతో దుమ్ములేపింది. వైరల్ అవుతున్న పెళ్లికూతుళ్ల డ్యాన్సుల వీడియోలను మీరు కూడా చూసేయండి..
Read Also : Bride Dance : రిసెప్షన్‌లో వరుడితో పెళ్లికూతురు రచ్చ.. డ్యాన్స్‌తో ఎలా రెచ్చిపోయారంటే.. వీడియో..!