Vishwaksen : మెగా డాటర్ నిహారికపై విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్.. ఫోన్ చేసి బెదిరించాడట!

Vishwaksen : మెగా ఫ్యామిలీ అన్నా, మెగా ఫ్యామీలికి సంబంధించిన వార్తలు అన్నా జనాలకు తెగ ఇంట్రెస్ట్ ఉంటుంది. బుల్లితెరపై నిహారిక తన డామినేషన్ చూపించి సిరీస్ లు నిర్మిస్తూ సక్సెస్ అయింది. అయితే సినిమాల్లో మాత్రమే నిహారిక ఫెయిల్ అయింది. చేసిన ప్రతీ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టేసింది.

అయితే ఇప్పుడు తనకు కలిసి వచ్చిన వెబ్ సిరీస్ ల మీదే ఆమె ఫోకస్ పెట్టేసింది. నిహారికకు ఓటీటీలే ఎక్కువగా కలిసి వ్చచాయి. ముద్దుపప్పు ఆవకాయ్, నాన్నకూచి వంటి వెబ్ సిరీస్ లు బాగానే ఆడాయి. ఇక ఆ మధ్య ఓ చిన్న ఫ్యామిలీ స్టోరీ అనే వెబ్ సిరీస్ ను నిర్మించగా అది సూపర్ హిట్ అయింది. అప్పుడు మళ్లీ కొత్త కథతో వచ్చింది.

vishwaksen-comments-on-niharika-konidela-college-days
vishwaksen-comments-on-niharika-konidela-college-days

హలో వరల్డ్ అంటూ అప్పుడెప్పుడో మరిచిపోయిన హీరోని మళ్లీ ఓటీటీలోకి తీసుకొచ్చింది. ఆర్యన్ రాజేష్ హీరోగా, సదా హీరోయిన్ గా ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది నిహారిక. ఐటీ వరల్డ్, సాఫ్ట్ వేర్ రంగం మీద బేస్ చేస్కొని ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. ఇది ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం విశ్వక్ సేన్ ను రంగంలోకి దింపింది. అన్నట్టు విశఅవక్ సేన్ ఆమె గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు.

నిహారిక కాలేజ్ రోజులను విశ్వక్ సేన్ గుర్తుకు తెచ్చాడు. మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం చేశానని, అక్కడ నిహరిక కొణిదెల అని ఒకామె ఉండేదని తెలిపారు. లెక్చరర్స్ కి, సీనియర్స్ కి ఎప్పుడూ భయపడేవాడిని కాదు కానీ…. ఆమెకు మాత్రం భయపడేవాడిని అంటూ తెలిపాడు. ఏయ్ అంటూ బెదిరించేదని.. ఇప్పుడు కూడా ఇలాగే ఫోన్ చేసి ఏయ్ అందని తెలిపాడు. నిహారికకు భయపడి వెంటనే వచ్చశానని వివరించాడు.

Read Also : Actor Sudhakar: సూపర్ స్టార్ కావాల్సిన సుధాకర్ ను ఇండస్ట్రీలో ఎదగకుండా చేశారా.. అందుకే అలా కమెడియన్ గా స్థిరపడ్డారా?