Guppedantha Manasu july 23 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రిషి, వసు సాక్షి లకు ఒక పరీక్ష పెడతాడు. ఈరోజు ఎపిసోడ్ లో రిషి వసుధర, సాక్షి లను రెండవ ప్రశ్న మూడో ప్రశ్న అడగగా రెండో ప్రశ్నలో సాక్షి గెలవడంతో ఇక మూడవ ప్రశ్నకి అత్యధిక ఓట్లతో వసు గెలుస్తుంది. మూడో ప్రశ్నకు వసు చెప్పిన సమాధానంతో రిషితో పాటు అక్కడున్న వారందరూ కూడా లేసి క్లాప్స్ కొడతారు. ఇక ఫైనల్ గా రిషి వసుధార ని తనకు అసిస్టెంట్ గా నియమించుకొని సాక్షిని జగతికి అసిస్టెంట్ గా నియమిస్తాడు.
ఆ మాటకు సాక్షి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఆ తర్వాత మీటింగ్ అయిపోవడంతో రిషి బయటకు వెళ్లి ఒక చోట నిలబడి వసుధార చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వసు ఇంత గొప్పగా మాట్లాడుతుంది అని తెలివితేటలు ఉన్నాయి కానీ నా మనసును ఎందుకు అర్థం చేసుకోవడం లేదు అంటూ పదే పదే వసుధార గురించి ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలోనే దేవయాని ఫోన్ చేసి సాక్షి గురించి మాట్లాడుతూ సాక్షిని అసిస్టెంట్ గా తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అనడంతో వెంటనే రిషి, సాక్షిని అసిస్టెంట్ గా తీసుకున్నాను కానీ నాకు కాదు జగతి మేడంకి అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు రిషి. అప్పుడు దేవయానికి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మరొకవైపు జగతి పుష్ప, సాక్షికి వరకు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండగా సాక్షి మాత్రం అక్కడ తనకు పని చేయడం ఇష్టం లేదు అన్నట్టుగా దిక్కులు చూస్తూ ఏదేదో ఆలోచిస్తూ ఉంటుంది.
అప్పుడు జగతి సాక్షిని గమనించి ఏంటి సాక్షి అనగా చెప్పండి ఆంటీ అని అనగా వెంటనే జగతి ఆంటీ కాదు మేడం అని పిలవాలి అని అంటుంది. అప్పుడు సాక్షి జగతి మీద ఉన్న కోపం అంతా పుష్ప మీద చూపిస్తుంది. మరొకవైపు రిషి వసుధార గురించి ఆలోచిస్తూ వసుకి ఫోన్ చేసి ఏదో మాట్లాడాలి అనుకొని రేపు కాలేజీకి తొందరగా వచ్చి గుడ్ నైట్ అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు.
అప్పుడు రిషి ఏం చేస్తున్నాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే మహేంద్ర గౌతమ్ అక్కడికి వచ్చి చదువుల పండుగ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక రేపటి ఎపిసోడ్ లో రిషి,వసు ఇద్దరూ అనుకోకుండా స్టోర్ రూమ్ లోకి వెళ్తారు. అక్కడ వసుధార పడిపోతూ ఉండగా రిషి పట్టుకోడానికి చూస్తాడు. అప్పుడు అనుకోకుండా వారిద్దరూ వలలో చిక్కుకోవడంతో అది చూసిన సాక్షి దానిని వీడియో తీసి ఎలా అయినా ఆ వీడియోతో బ్లాక్మెయిల్ చేయాలి అని అనుకుంటుంది.
Read Also : Guppedantha Manasu july 22 Today Episode : దగ్గరవుతున్న వసు, రిషి..కోపంతో రగిలిపోతున్న సాక్షి..?