Telugu NewsLatestGuppedantha Manasu july 22 Today Episode : దగ్గరవుతున్న వసు, రిషి..కోపంతో రగిలిపోతున్న సాక్షి..?

Guppedantha Manasu july 22 Today Episode : దగ్గరవుతున్న వసు, రిషి..కోపంతో రగిలిపోతున్న సాక్షి..?

Guppedantha Manasu july 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో పుష్ప వసుధార మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు. ఈరోజు ఎపిసోడ్ లో పుష్పకి ఫోన్ రావడంతో బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు రిషి, వసు కీ పువ్వు ఇచ్చి ఏమి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ చదువుల పండుగ సక్సెస్ కావాలి అని మెసేజ్ చేస్తాడు. ఆ పువ్వుని చూసి వసుధార సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మరొకవైపు జగతి దంపతులు వసు,రిషి గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు.

Advertisement
 Guppedantha Manasu july 21 Today Episode : Rishi puts Sakshi and Vasudhara to test for the assistant post in todays guppedantha manasu serial episode
Guppedantha Manasu july 22 Today Episode : Rishi puts Sakshi and Vasudhara to test for the assistant post in todays guppedantha manasu serial episode

చదువుల పండుగ ప్రాజెక్ట్ అయిపోయేలోగా వారిద్దరూ మల్లి మొదటి లాగే కలిసిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. మరొకవైపు సాక్షి చదువుల పండుగ ప్రాజెక్టులో రిషికి అసిస్టెంట్ గా ఉంటూ ఇలా అయినా రిషికి దగ్గర అవుతాను నాకు హెల్ప్ చేయండి ఆంటీ అని అనగా తప్పకుండా చేస్తాను అని అంటుంది దేవయాని. మరొకవైపు వసుధార ఒంటరిగా కూర్చుని చదువుతూ ఉండగా ఇంతలోనే గౌతమ్ అక్కడికి వచ్చి చదువుల పండుగ విషయం గురించి మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి రిషి వస్తాడు.

Advertisement

Guppedantha Manasu : ఒక కోటు..ఒక బ్యాడ్జి..ఇద్దరి మధ్య సాన్నిహిత్యం

వారిద్దరికీ క్లాస్ పీకి అక్కడ నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత వసుధార బాడ్జెట్స్ గురించి మాట్లాడటం కోసం రిషి రూమ్ కి వెళ్తుంది. అప్పుడు వాటి గురించి మాట్లాడుతూ ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు బాడ్జెట్స్ ఎలా ఉన్నాయో తెలియాలి అంటే ఎవరికైనా పెట్టి చూడాలి అని అనగా వెంటనే వసు పుష్పకి ఫోన్ చేస్తుండగా రిషి వద్దు అనడంతో వెంటనే వసుధార సార్ మీరు ఒకసారి మీ కోటు వేసుకోండి అని చెబుతుంది.

Advertisement

అప్పుడు వసు తెచ్చిన బాడ్జెట్స్ రిషి జోబీకి పెడుతూ ఉండగా ఇంతలో అక్కడికి వచ్చిన సాక్షి అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వీరిద్దరి మధ్య ఏం జరుగుతోంది అంటూ వసుని చూస్తూ మండిపడుతూ ఉంటుంది. అప్పుడు రిషి తన కోట్ ని వసుధారని వేసుకోమని చెప్పడంతో సాక్షి మరింత కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అలా వారిద్దరూ ప్రేమగా చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా సాక్షి అది చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది.

Advertisement

ఆ తర్వాత చదువుల పండుగ గురించి అందరూ మీటింగ్ హాల్ లో కూర్చోగా అప్పుడు రిషి తన అసిస్టెంట్ గా ఉండటం కోసం వసుధార సాక్షిలకు ఒక పరీక్ష పెడతాను అని అంటాడు. అప్పుడు గౌతమ్ మహేంద్ర అడ్డు చెప్పగా లేదు ఆ పరీక్షలో ఎవరు గెలిస్తే వారే నాసిస్టెంట్ గా ఉంటారు అని చెబుతారు. అప్పుడు కాలేజీ స్టాప్ తో మాట్లాడుతూ వారిద్దరిని అడిగిన ప్రశ్నలకు మీకు సమాధానం నచ్చితే ఓటేయండి అని చెబుతాడు. అలా మొదటి ప్రశ్నకు సాక్షికి ఎక్కువగా ఓట్లు వస్తాయి. రెండవ ప్రశ్నకు సాక్షి సమాధానం చెబుతుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.

Advertisement

Read Also : Guppedantha Manasu july 21 Today Episode : సాక్షికి తగిన విధంగా బుద్ధి చెప్పిన వసు.. వసుధారకి పువ్వు ఇచ్చిన రిషి..?

Advertisement
Advertisement
admin
adminhttps://tufan9.com/
Tufan9 Telugu News And Updates Breaking News All over World
RELATED ARTICLES

తాజా వార్తలు