Karthika Deepam july 22 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతన్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో సౌందర్య వాళ్ళు అమ్మవారికి బోనం సమర్పిస్తారు. ఈరోజు ఎపిసోడ్ లో పూజారి మనసులో అనుకున్న కోరికను చీటీలో రాసి ఆ హుండీలో వేస్తే ఎప్పటికప్పుడు ఆ హుండీలో ఉన్న చీటీలను అమ్మవారి పాదాల దగ్గర వేస్తాము అమ్మవారు తప్పకుండా ఆ కోరికను తీర్చుతుంది అని అనగా వెంటనే ప్రేమ తప్పకుండా కోరికలు తీరుతాయ పూజారి గారు అని అడగగా తీరుతాయి అనడంతో ప్రేమ్ తో పాటు అక్కడ ఉన్న వారందరూ కూడా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు.
అప్పుడు సౌందర్య కుటుంబం ఒక్కొక్కరుగా తమ కోరికలను చీటిలో హుండీలో వేస్తారు. అప్పుడు సౌందర్య సౌర్యని వెళ్లి కోరిక కోరమని అడగగా అప్పుడు సౌర్య,నిరుపమ్ ని ఉద్దేశిస్తూ నా కోరికలు ఎప్పుడో ఆవిరి అయ్యాయి అని అంటుంది. అప్పుడు సౌందర్య కోసం సౌర్య వెళ్లి చీటీ రాసి అందులో వేస్తుంది. ఆ తర్వాత గుడిలో ప్రదక్షిణలు చేయడం కోసం సౌర్యని లోపలికి పిలుచుకొని వెళ్తుంది సౌందర్య.
Karthika Deepam : సౌర్య కోసం ఒక్కటైనా ప్రేమ్, హిమ..
ఆ తర్వాత అక్కడి నుంచి అందరు వెళ్లిపోవడంతో హిమ వెళ్లి సౌర్య ఏం రాసిందో అని హుండీలో ఉన్న చీటీని తీసి చదవగా అందులో సూర్య అమ్మానాన్న రావాలి అని రాసి ఉంటుంది. దాంతో హిమ ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు తెచ్చుకొని ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత సౌర్య వెళ్ళిపోతూ ఉండగా హిమ వెళ్ళి మాట్లాడించగా అప్పుడు సౌర్య, హిమ మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా హిమ పై సీరియస్ అవుతుంది.
అప్పుడు సౌర్య కోపంతో హిమను కొట్టాలి అని కూడా చూస్తుంది. అప్పుడు కోపంతో సౌర్య ఇప్పుడు చెబుతున్నాను గుర్తుపెట్టుకో మీ నిరుపమ్ బాగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అన్నా కూడా నేను చేసుకోను అని తెగేసి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది సౌర్య. ఆ తర్వాత నిరుపమ్, ప్రేమ్ ఇద్దరూ కారులో వెళ్తూ ఉండగా అప్పుడు ప్రేమ్ గుడిలో విషయం గురించి మాట్లాడడంతో నిరుపమ్ సీరియస్ అవుతాడు.
అంతేకాకుండా నాకు ఆ సౌర్యతో పని ఏమిటి అంటూ ప్రేమ్ పై కోప్పడతాడు. మరొకవైపు సౌందర్య, ఆనంద్ రావ్ లు హిమ,సౌర్య లను కలపడం కోసం ఆటోలో గాలి తీసేస్తారు. ఇంతలోనే సౌర్య అక్కడికి వచ్చి వేరే అమ్మాయికి ఫోన్ చేసి ఆటోకి ఇంకొక టైర్లు తీసుకొని రమ్మని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సౌందర్య వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో మరొక ప్లాన్ వేస్తారు.
మరొకవైపు స్వప్న,ప్రేమ్ ఫ్యూచర్ గురించి అడగగా ప్రేమ్ మాత్రం తిన్నగా సమాధానం చెప్పకుండా ఏదేదో చెబుతూ ఉండగా ఇందులోని శోభ అక్కడికి వచ్చి నిరుపమ్ గురించి అడిగి నిరుపమ్ దగ్గరికి వెళ్తుంది. ఆ తర్వాత నిరుపమ్ తన మాటలతో మాయ చేసి కాఫీ షాప్ కి తీసుకొని వెళ్తుంది శోభ. ఆ తర్వాత హిమ హాస్పిటల్ కి బయలుదేరి వెళుతూ ఉండగా అప్పుడు ఆనందరావు బాగాలేదు అని నటిచడం మొదలు పెడతాడు. రేపటి ఎపిసోడ్ లో హిమ,ప్రేమ్ ఇద్దరూ ఒకటే ఎలా అయిన శౌర్య,నిరుపమ్ లను ఒకటి చేయాలి అని అనుకుంటారు.