Intinti Gruhalakshmi July 8 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ప్రేమ్, శృతి పై ఫైర్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో లాస్య నందు తో మాట్లాడుతూ సంజన మనల్ని మ్యూజిక్ కాంపిటీషన్ కు ఆహ్వానించింది మనిద్దరం కలిసి ఎక్కడికి వెళ్దాం మనకు మనశాంతిగా ఉంటుంది అనడంతో నందు సరే అని అంటాడు. మరొకవైపు ప్రేమ్ మ్యూజిక్ విషయంలో ఎంత కాన్సన్ట్రేషన్ చేయాలి అనుకున్నా ఇంట్రెస్ట్ పెట్టలేకపోతాడు.
మరొకవైపు తులసి కూడా ప్రేమ్ గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలోనే సంజన ఫోన్ చేసి మీ అబ్బాయి ప్రిపేర్ అవుతున్నాడు కదా అని అడగగా అవును అదే పని మీద ఉన్నాడు అని చెబుతుంది తులసి. అప్పుడు ఆమె మీ మీద నమ్మకంతో నీ కొడుకుకి సులువుగా అవకాశం ఇచ్చాము ఏమైనా తేడా వస్తే నాకు ప్రాబ్లం అవుతుంది అనడంతో ఏం ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను అని అంటుంది తులసి.
మరొక వైపు ప్రేమ్ చిరాకు పడుతూ కనిపిస్తూ ఉంటాడు. ఇక తులసి ఇంతకుముందు ప్రేమ రాసుకున్న పాటల పుస్తకాన్ని చూసి ఇంత సత్తా ఉన్నప్పటికీ ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు అని కొడుకుని తలుచుకొని బాధపడుతూ ఉండగా ఇంతలో అంకిత అక్కడికి వచ్చి మీరు ఇలా దూరంగా ఉన్నాడు కాబట్టే ప్రేమ్ ఏ విషయంలో కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు అని చెప్పడంతో తులసి ప్రేమ్ కోసం బయలుదేరుతుంది. ఇక మరొకవైపు తులసి ప్రేమ్ దగ్గరకు వెళుతుంది. అప్పుడు తులసి ప్రేమ్ మీద తనకు ఎంత ప్రేమ ఉందో మాటల్లో చెప్పడంతో, ప్రేమ్ కూడా తను ఎన్ని బాధలు కష్టాలు పడ్డాడో తులసీకూ చెప్పడంతో తులసి బాధపడుతూ ఉంటుంది.
Intinti Gruhalakshmi : కావాలనే తులసితో గొడవ పెట్టుకున్న లాస్య..?
ఆ తర్వాత తులసీ తన మాటలతో ప్రేమ్ ని ఎంకరేజ్ చేస్తుంది. అప్పుడు ప్రేమ్ తన తల్లిని గట్టిగా హత్తుకొని ఎమోషనల్ అవుతాడు. ఆ తర్వాత ప్రేమ్ సంతోషంతో గిటార్ వాయించి తులసి శృతికి పాట వినిపించడంతో వాళ్లు సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే కాంపిటీషన్ దగ్గరికి తులసి తన చిన్న కొడుకుని తీసుకొని వస్తుంది. ప్రేమ్ ఎలా అయినా ఈ కాంపిటీషన్ లో గెలుస్తాను అని అనడంతో అనసూయ దంపతులు కూడా ప్రేమ్ ని మరింత ఎంకరేజ్ చేస్తారు. ఇంతలో అభి అక్కడికి రాగా అప్పుడు తులసి పెద్దోడు చిన్నోడికి శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చాడు అని అంటుంది.
అప్పుడు అభి ప్రేమ్ కు ఆల్ ది బెస్ట్ చెప్పి తులసి గురించి కొద్దిసేపు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి లాస్య వాళ్ళు ఎదురుపడతారు. అప్పుడు లాస్య కావాలనే తులసిని గెలికి మరి తులసితో గొడవ పెట్టుకుంటుంది. నందు కూడా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు తులసి ఎవరు ఏమనుకున్నా నువ్వు ఈ కాంపిటీషన్ లో గెలిచి నువ్వంటే ఏంటో నిరూపించుకోవాలి అని ధైర్యం చెబుతుంది తులసి. అప్పుడు లాస్య ప్రేమ్ విషయంలో ఒక ప్లాన్ వేస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Intinti Gruhalakshmi july 7 Today Episode : తులసి మీద కోపంతో రగిలిపోతున్న లాస్య.. ఆనందంలో తులసి కుటుంబం ..?