RRR Movie Release : దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషన్లో పాన్ ఇండియా లెవెల్లో ఆర్ఆర్ఆర్ సినిమానీ జక్కన్న తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావలసి ఉండగా.. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఈ సినిమా విడుదల వాయిదా వేయవలసి వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్ఆర్ఆర్ టీం ముంబైలో గ్రాండ్ గా ఒక ఈవెంట్ చేసింది. ఆ ఈవెంట్ కి సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇలా ఈ సినిమా కోసం చేసే ప్రమోషన్స్, సినిమాలోని పాటలు, సినిమా ట్రైలర్ ఈ సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం ముంబైలో కండక్ట్ చేసిన ఈవెంట్ నిజానికి లైవ్ టెలికాస్ట్ చేయాల్సి ఉండగా దానిని రికార్డు చేసి జనవరి 1తేదీన టీవీలలో టెలికాస్ట్ చేశారు. టెలికాస్ట్ రైట్స్ కారణంగా ఈ ఈవెంట్ నీ పూర్తిగా తెలుగు ప్రేక్షకుల ముందు ఉంచలేకపోయారు. ఐతే ఇటీవల ఆ ఈవెంట్ కి సంబంధించిన పూర్తి వీడియో అప్లోడ్ చేశారు. ఈ వీడియోలో రాజమౌళి మాట్లాడుతూ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఒక ప్రత్యేకమైన సన్నివేశం గురించి రాజమౌళి చేసిన వ్యాఖ్యలు సినిమా మీద అంచనాలను మరింత పెంచేశాయి.
ఈ సినిమా ఇంట్రడక్షన్ సీన్ కోసం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ రాజమౌళి ఎంతో ఇబ్బంది పెట్టారని ఈ సందర్భంగా తెలియ చేశారు. ఈ సినిమా కోసం ఎంతగానో శ్రమించిన ప్రతి ఒక్కరికీ ఆయన పేరు పేరున ధన్యవాదాలు తెలియచేశారు. ఈ సినిమాలోని ప్రత్యేకమైన సన్నివేశం గురించి రాజమౌళి మాట్లాడుతూ థియేటర్స్ లో ఆ సీన్ చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరికి నరాలు బిగుసుకుపోయి గుండె వేగం పెరుగుతుందని ఈ సందర్భంగా ఆయన కామెంట్ చేశారు. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇలా జక్కన్న ఆ సన్నివేశం గురించి చెప్పడంతో సినిమా పై మరింత ఆసక్తి నెలకొనిందని చెప్పవచ్చు.
Read Also : Sreeja Kalyan : ఆ హీరోయిన్‌తో చనువుగా ఉండటం వల్లే శ్రీజ కళ్యాణ్‌కు విడాకులు ఇవ్వనుందా?
Tufan9 Telugu News And Updates Breaking News All over World