MLA Roja : టాలీవుడ్ సీనియర్ హీరోయిన్, ఎమ్మెల్యే రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒకవైపు ఎంటర్టైన్ రంగంలోనూ మరోవైపు, రాజకీయాలలోను ఎంతో చురుకుగా ఉంటూ ఒక వైపు ప్రజలను మరొక వైపు ప్రేక్షకులను మెప్పిస్తూ వచ్చారు.ఇక ఎమ్మెల్యే రోజా జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కార్యక్రమానికి స్పెషల్ అట్రాక్షన్ గా రోజా ఉంటున్నారు.అయితే గత కొన్ని నెలల క్రితం ఈమెకు అనారోగ్య కారణంగా ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోవడంతో ఈ కార్యక్రమానికి పూర్తిగా ఏదో వెలితి ఉన్నట్టు అనిపించింది.
ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తూ ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సంపాదించుకున్న రోజా ఒకానొక సందర్భంలో తనకు ఇష్టమైన హీరో గురించి బయట పెట్టారు. ఒక స్కిట్ లో భాగంగా దొరబాబు మహేష్ బాబు శాంతిస్వరూప్ భూమిక పాత్రలో నటించారు. ఈ స్కిట్ పూర్తి అయిన తర్వాత రోజా మాట్లాడుతూ నువ్వు మహేష్ బాబువా ఇంకొకసారి ఇలాంటి స్కిట్స్ చేస్తే బాగుండదు ఇక్కడ మహేష్ ఫ్యాన్స్ అంటూ అతనికి స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఈ విధంగా మహేష్ బాబు ఎంతో మంది అమ్మాయిల మనసు దోచుకున్నారు. అదేవిధంగా ఈ జబర్దస్త్ జడ్జి రోజా సైతం మహేష్ బాబు పై మనసు పారేసుకున్నారు.
ఈ విధంగా తనకు మహేష్ బాబు అంటే ఇష్టమని చెప్పిన రోజా మరోసారి తన గురించి బయటపెట్టారు. హైపర్ ఆది స్కిట్ లో భాగంగా హోమ్ టూర్ అంటూ నగరిలో ఉన్న రోజా ఇంటికి వెళ్లారు. ఇలా ఇంటిలోకి వెళ్లగానే ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో ని చూసిన హైపర్ ఆది వెంకటేశ్వర స్వామిని ఏమని వేడుకుంటారమ్మ అని అడగడంతో వెంటనే రోజా కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబుతో సినిమా చేయాలని ఉందని ఆ దేవుడిని కోరుకుంటున్నాను అంటూ అసలు విషయం బయట పెట్టారు. రోజా ఇలా చెప్పడంతో వెంటనే హైపర్ ఆది పంచ్ వేశారు.కృష్ణ రామ అంటూ ఈ వయసులో ఇంట్లో కూర్చోక మనకెందుకు అమ్మ కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు తో సినిమాలు చేయడం అంటూ అనడంతో వెంటనే రోజా చంపేస్తా అంటూ అతనికి వార్నింగ్ ఇచ్చింది.
Read Also : RRR: ఆర్ఆర్ఆర్ సినిమాలో హార్ట్ బీట్ రెట్టింపు చేసే సన్నివేశం అంటూ.. బాంబు పేల్చిన జక్కన్న..!
Tufan9 Telugu News And Updates Breaking News All over World