Sudheer Rashmi : బుల్లితెరపై ఉర్రూతలూగించే జబర్దస్త్ షో గురించి తెలియని వారుండరు. ఎందరో జీవితాలను నిలబెట్టిన ఈ ప్రోగ్రాంలో ఒకప్పటి కమెడినయ్స్ ఇప్పుడు లేరు. కానీ వారి గురించి కొన్ని విషయాలు ప్రస్తావించినప్పుడు వారితో కలిసి పని చేసినవారు అప్పటి సంగతులు గుర్తు చేసుకుంటున్నారు. జబర్దస్త్ లవ్ కపుల్ గా పేరొందిన సుధీర్, రష్మిలు చాలా డీప్ గా ప్రేమలో పడ్డారని టాక్. ఈ నేపథ్యంలో వీరి మధ్య జరిగిన కొన్ని రొమాంటిక్ సన్నివేషాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.

ఒకప్పుడు సుధీర్, రష్మీలు స్కిట్ లోకి వస్తే వచ్చే హుషారే వేరు. లవ్ ట్రాక్ ను సీన్ లోకి తెచ్చి వీరిద్దరూ కలిసి ఆడియన్స్ కు విపరీతమైన వినోదాన్ని అందించేవారు. దీంతో ఈ జంట వేదికపైకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లు. కానీ ప్రస్తుతం సుధీర్, జబర్దస్త్ లో లేడు. కొన్ని కారణాల వల్ల ఈ షఓను వదిలి వెళ్లాడు. సుధీర్ మాత్రమే కాకుండా ఆయన తోటి వాళ్లతో చాలా మంది ఇందులో నుంచి వెళ్లిపోయాడు.
జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఇందులో కంటెస్టెంట్ల కంటే జడ్జిగా కృష్ణ భగవాన్ పంచులే పేలుతున్నాయి. అటు మాజీ హీరోయిన్స్ కుష్భూ తన పర్సనల్ స్టోరీ చెప్పి ఎమోషనల్ అయింది. ఇక ఇమ్మాన్యూయేల్, రష్మిలు చేసిన కామెడీ ఆకట్టుకున్నాయి. త్వరలో ఇందుకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ కూడా ప్రసారం కానుంది.
