Sri Reddy : శ్రీరెడ్డి.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. క్యాస్టింగ్ కౌచ్ అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది శ్రీరెడ్డినే.. అంతగా పాపులర్ అయింది.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గానూ, ఎప్పుడూ వివాదాల్లో ఉండే శ్రీరెడ్డి తనకు నచ్చవారిని తన మాటలతో కడిగిపారేస్తుంటుంది. ఆమె డేరింగ్ అండ్ డ్యాషింగ్ ఎక్కువనే చెప్పాలి. అందుకే శ్రీరెడ్డిని ఫైర్ బ్రాండ్ అని నెటిజన్లు ముద్దుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం తన సొంత యూట్యూబ్ ఛానళ్లో రోజురోజుకు రుచికరమైన వంటల వీడియోలను అప్ లోడ్ చేస్తూ అభిమానులను అలరిస్తోంది శ్రీరెడ్డి.
ఇప్పుడు చెన్నై నడిరోడ్డపై శ్రీరెడ్డి ఇలా కనిపించేసరికి నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. శ్రీరెడ్డి ఇదేం పని అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఇంతకీ శ్రీరెడ్డి చెన్నై వీధుల్లో అర్ధరాత్రి సమయంలో నడిరోడ్డుపై వచ్చేపోయే బైకులను అపుతోంది. అంతేకాదు.. ఫోన్ నెంబర్ ఇస్తావా.. వస్తావా అంటూ డబుల్ మీనింగ్ డైలాగులను వదులుతోంది. ఇదంతా ఫ్రాంక్ చేస్తున్నారా? లేదా నిజంగానే శ్రీరెడ్డి ఇలా చేసిందా? అనేది తెలియాలంటే ఈ వీడియోను చూడాల్సిందే.
Sri Reddy Stops biker on Road in Midnight Chennai Video Goes Viral on Social Media
శ్రీరెడ్డిని తెలుగు సినీపరిశ్రమ నుంచి బ్యాన్ చేయడంతో ఆమెకు సినిమాల్లో అవకాశం లేకుండా పోయాయి. దాంతో చేసేది ఏమిలేక చెన్నైకి మకాం మార్చేసింది శ్రీరెడ్డి. ఒకవైపు సినిమాల్లో ట్రై చేస్తూనే ఉంది. అంతేకాదు.. శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో వీడియోలు చేస్తూ డబ్బులు బాగానే సంపాదిస్తోంది శ్రీరెడ్డి. నాటు వంటకాలను తనదైన స్టైల్‌లో వంటలు చేస్తూ వీడియోలను చేస్తోంది. తమిళంలో బాగా పాపులారిటీ తెచ్చుకునేందుకు యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలను ఇస్తుంది శ్రీరెడ్డి. తెలుగు ప్రేక్షకుల మాదిరిగానే తమిళంలోనూ అంతే ఆదరణ పెరుగుతోంది. దాంతో శ్రీరెడ్డి ఇంటర్వ్యూల కోసం తెగ ఆరాటపడుతున్నారు.
Sri Reddy : వామ్మో.. శ్రీరెడ్డి ఇదేం పని.. అర్ధరాత్రి దాటాకా రోడ్డుపైకొచ్చి బైకులను ఆపుతోంది.. !
Sri Reddy Stops biker on Road in Midnight Chennai Video Goes Viral on Social Media
అలాంటి శ్రీరెడ్డి.. ఇప్పుడు నడిరోడ్డుపై వచ్చేపోయే బైకర్లకు హాయ్ చెబుతోంది. అలాగే కార్లలో యాంకర్ మీద పడటం, కారులో లైట్లు ఆర్పడం, ఆ టైప్ నాన్ వెజ్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులను గట్టిగానే వాడేశారు. శ్రీరెడ్డి యాంకర్ ఛాలెంజ్‌కి ఓ చెప్పేసింది. ఇప్పటివరకూ ఎవరి దగ్గరైనా ఫోన్ నెంబర్ తీసుకున్నారా? అంటూ యాంకర్ అడిగిన ప్రశ్నకు శ్రీరెడ్డి ఇలా బదులు ఇచ్చింది.
రాత్రి సమయంలో కారు దిగి నెంబర్ తీసుకుని వస్తావా? అని అందరిని అడుగుతోంది. యాంకర్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఓకే అనేసింది శ్రీరెడ్డి. వెంటనే కారు దిగి వెళ్లి.. రోడ్డుపై కవ్విస్తూ ఫోన్ నెంబర్లు వెతికేపనిలో పడింది. రాత్రి సమయంలో రోడ్డుపై వెళ్లే బైకర్స్‌ని ఆపి ఫోన్ నెంబర్లు అడుగుతోంది శ్రీరెడ్డి. రాత్రిపూట చెన్నై రోడ్లపై శ్రీరెడ్డి చేసిన హంగామా అదిరిపోయింది.
Read Also : LPG Gas Subsidy : ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ లిస్టులో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలా.. అయితే ఇలా చేయండి?