HomeLatestJabardasth : జబర్దస్త్‌‌లోకి కార్తీకదీపం సిస్టర్స్ ఎంట్రీ.. అందుకే.. ఇంత హైప్ ఇచ్చారా?

Jabardasth : జబర్దస్త్‌‌లోకి కార్తీకదీపం సిస్టర్స్ ఎంట్రీ.. అందుకే.. ఇంత హైప్ ఇచ్చారా?

Jabardasth : జబర్దస్ కామెడీ షోలో నుంచి పాతవాళ్లు వెళ్లిపోతున్నారు.. కొత్తవాళ్లు వస్తున్నారు. కానీ, ఎన్ని కామెడీ షోలు వచ్చినా మల్లేమాల మాత్రం జబర్దస్త్‌ను తగ్గేదేలే అన్నట్టుగా విజయవంతంగా ముందుకు తీసుకెళ్తుంది. జబర్దస్త్ టీం సభ్యులు మారిపోతున్నారు.. జడ్జీలు మారారు.. కొత్త జడ్జీలు వచ్చారు. అయినా జబర్దస్త్ అదే దూకుడుగా దూసుకెళ్తోంది. జబర్దస్త్ కామెడీ షోలోకి కొత్త కంటెస్టెంట్లు వస్తున్నారు. అందులో కొందరు మాత్రమే ప్రేక్షకులకు గుర్తుండిపోతున్నారు. మిగతావారంతా స్ర్కిప్టులకే పరిమితమవుతున్నారు. ఇప్పుడు కొత్తగా జబర్దస్త్ కామెడీ షోలోకి కార్తీకదీపం ఫేమ్ సిస్టర్స్ హిమ, శౌర్య ఎంట్రీ ఇచ్చారు.

Advertisement
jabardasth-karthika-deepam-fame-sisters-hima-and-sowrya-grand-entry-into-jabardasth-promo-released
jabardasth-karthika-deepam-fame-sisters-hima-and-sowrya-grand-entry-into-jabardasth-promo-released

ఈ ఇద్దరు చిచ్చురపిడుగులు ఉన్నంతకాలం కార్తీకదీపం సాఫీగా సాగిపోయింది. ఎందుకంటే.. టీవీ సీరియల్ ప్రేక్షకులు అంతగా వారిద్దరికి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు వారిద్దరూ కార్తీక దీపం నుంచి తప్పుకున్నారు. వాళ్ల స్థానంలో పెద్దగా అయినట్టుగా హిమగా కీర్తి భట్, శౌర్యగా అమూల్య గౌడను తీసుకొచ్చారు. వీరితో కార్తీకదీపాన్ని ముందుకు నడిపిస్తున్నా అప్పుడు ఉన్నంత కనెక్టివిటీ ఆడియోన్స్ మధ్య ఉన్నట్టుగా కనిపించడం లేదు.

Advertisement

Jabardasth : వస్తువస్తూనే.. అనసూయపై కార్తీకదీపం సిస్టర్స్ సెటైర్లు.. 

కార్తీకదీపం సీరియల్ పెద్ద హిట్ అవ్వడానికి వంటలక్క దీప, డాక్టర్ బాబు ఒకవైపు అయితే.. హిమ (సహృద), శౌర్య (బేబి క్రితిక)లు ఇద్దరూ మరోవైపు.. నలుగురు కలిసి సీరియల్‌ను టాప్ రేటింగ్‌లోకి తీసుకెళ్లారు. లేటెస్టుగా శౌర్య, హిమ ఇద్దరూ జబర్దస్త్ కామెడీ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరి ఎంట్రీకి మల్లెమాల నిర్వాహకులు కూడా ఆరంభం అదిరేలా మంచి హైప్ ఇచ్చారు. రావడం రావడంతోనే యాంకర్ అనసూయపై సెటైర్లు వేశారు.

Advertisement

మహిష్మత సామ్రాజ్యపు మహరాణులుగా కనిపించి అలరించారు. రావడంతోనే అనసూయపై సౌర్య సెటైర్లు వేసేసింది. పక్క రాజ్యపు మహరాణి ఎలా ఉందంటూ అనసూయపై సెటైర్ వేశారు. ఆమె ఏమైనా చేస్తుందా? లేదా ఖాళీగానే ఉందా? అంటూ శౌర్య పంచ్ విసిరింది. వెంటనే అందుకున్న నూకరాజు.. ఆమె ఖాళీగా ఉండటం ఏంటి అమ్మా.. మన రాజ్యంలో కామెడీషో చేస్తూ పక్క రాజ్యంలో ప్రోగ్రామ్‌ కూడా చేస్తోంది. రాత్రి ఈవెంట్లో బిజీగా ఉంటూ ఉదయాన్నే రెస్ట్ తీసుకుంటున్నారు అమ్మగారూ అనసూయ.. ఆమె చాలా బిజీ షెడ్యూల్ అన్నాడు నూకరాజు. జబర్దస్త్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన కార్తీకదీపం సిస్టర్స్ ఏదో ఒక ఎపిసోడ్‌తోనే మమ అనిపిస్తారా? లేదా పూర్తిగా కొనసాగుతారా లేదో చూడాలి.

Advertisement

Read Also : YS Bharathi : వైఎస్ విజయమ్మ రాజీనామాతో పార్టీలో మొదలైన కొత్త చర్చ.. వైఎస్ భారతి రాజకీయాలలోకి రానున్నారా?

Advertisement
Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

Most Popular

Recent Comments