Karthika Deepam November 17 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తిక దీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో ఆటోలో సౌర్య ఇంద్రుడు దంపతులు కలిసి వెళుతూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్లో శౌర్య ఆలోచిస్తూ ఉండగా అప్పుడు ఇంద్రుడు ఏంటి బంగారు మళ్ళీ ఇదే ఊరికి వచ్చేద్దామా అని అనగా అప్పుడు శౌర్య తన నానమ్మ తాతయ్యలో వచ్చి తీసుకెళ్తారేమో అన్న భయంతో వద్దులే బాబాయ్ అని అనడంతో ఇంద్రుడు సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడు ఇంద్రుడు తన మనసులో వచ్చిన పని తొందరగా చూసుకుని వెళ్లిపోవాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక హోటల్ కి వెళ్తారు. మరొకవైపు మోనిత కోసం ఇంటిదగ్గర దీప కార్తీక్ ఇద్దరు ఎదురుచూస్తూ ఉంటారు.
అప్పుడు దీప ఎలా అయినా ఈరోజు మోనిత సంగతి తేల్చేస్తాను అని అనగా వదిలేయ్ తనతో గొడవ ఎందుకు అని అంటాడు. అది నన్ను ఏదో ఒక విధంగా నన్ను చంపాలని చూస్తూనే ఉంటుంది అని ఉంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఎన్ని చెప్పినా కూడా ఆ దీప మాత్రం వినిపించుకోకుండా మోనిత తో ఎలా అయినా ఈరోజు తేల్చుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు మోనిత కారులో వస్తూ ఉండగా ఏంటి సౌందర్య ఆంటీ నన్ను పట్టుకుంది ఆనందుని కూడా ఇచ్చేసాను కదా ఇంకా వీళ్లకు ఏం కావాలి. అంకుల్ అంటే ఏదో ఒక విధంగా మేనేజ్ చేశాను కానీ ఆంటీ ఆవలిస్తే పేగులు లెక్కబెడుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది మోనిత.
అప్పుడు మౌనిక ఎలా అయినా ఆంటీ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు శౌర్య హోటల్లో ఐస్ క్రీమ్ తింటూ ఉండగా ఇంతలోనే ఇంద్రుడు వచ్చిన పని అయిపోయింది అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో అటుగా వెళుతున్న సౌందర్య సౌర్య ను చూసి కారు ఆపుతుంది. అప్పుడు ఏంటి ఆంటీ సడన్గా కారు ఆపింది అని మోనిత అటు చూడడంతో సౌర్యను చూసి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు సౌర్య కోసం సౌందర్య అక్కడికి వెళ్లడంతో వెంటనే మోనిత అక్కడి నుంచి తప్పించుకుని వెళుతుంది.
Karthika Deepam నవంబర్ 17 ఎపిసోడ్ : సౌర్యని ఇంటికి తీసుకెళ్లాలి అనుకుంటున్న సౌందర్య..
అప్పుడు ఇంద్రుడు వెళ్దాం శౌర్యమ్మ అనడంతో ఎక్కడికి ఊరేగాల్సిన అవసరం లేదు వెళ్దాం పద అని అంటుంది
సౌందర్య. అప్పుడు నానమ్మ నేను రాను నానమ్మ అని అంటుంది సౌర్య. మీరు తాతయ్య చెప్పినట్టుగా వీళ్ళు నీ మనసు మార్చేశారు అని ఇంద్రమ్మ దంపతులను తిడుతూ ఉండడంతో వాళ్లను ఏమీ అనొద్దు నానమ్మ అని అంటుంది శౌర్య. ఆ తర్వాత సౌందర్య సౌర్య పెద్ద మనిషి అయింది అని తెలుసుకొని సంతోషపడుతూ మాకు ఆ ముచ్చట కూడా లేకుండా చేసావా శౌర్య అని బాధపడుతూ ఉంటుంది.
మరొకవైపు మోనిత కార్తీక్ వాళ్ళ కోసం వెతుకుతూ ఉండగా దీప ఇంటికి తన ఇంటికి తాళం వేసి ఉండటంతో ఎక్కడికి వెళ్లారు అని టెన్షన్ పడుతూ ఉండగా ఇంతలో దుర్గా అక్కడికి వచ్చి మోనిత కార్ కిస్ తీసుకుని ఆట పట్టించి అక్కడి నుంచి మోనిత కారు బీగాలు తీసుకొని వెళ్ళిపోతాడు. మరొకవైపు సౌందర్య ఫంక్షన్ గురించి తనకు శౌర్య చెప్పలేదు అని సీరియస్ అవుతూ ఉంటుంది. ఏది ఏమైనా నా మాట విను శౌర్య వెళ్ళిపోదాం పద అని అంటుంది సౌందర్య.
Read Also :