...

Singer Sunitha : భర్తపై నెటిజన్‏ నెగిటివ్ కామెంట్స్.. దిమ్మతిరిగేలా కౌంటర్ ఇచ్చిన సింగర్ సునీత..!

Singer Sunitha : సింగర్ సునీత.. పరిచయ అక్కర్లేదు.. ఆమె పాడిన పాటలే సింగర్ సునీతను ప్రతి ప్రేక్షకుడి హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి.. ఆమె పాటలే కాదు.. ఆమె అభినయం కూడా ఎంతోమంది ఇష్టపడతారు. ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు సునీత. ఒక డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాదు.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సునీత తన ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంటారు.

Advertisement

అయితే ఆమె కుటుంబ సభ్యులకు సంబంధించి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసినప్పుడు కొంతమంది ఆకతాయిలు అసభ్యంగా నెగటివ్ కామెంట్లతో ఇష్టానుసారంగా మాట్లాడేస్తుంటారు. అలాంటి వాళ్లకి సింగర్ సునీత తనదైన శైలిలో గట్టిగానే వారికి కౌంటర్ ఇస్తుంటారు. అయితే ఇటీవల రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరంలోని సమతా విగ్రహాన్ని సందర్శించేందుకు సింగర్ సునీత తన భర్తతో కలిసి వెళ్లారు. సాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ (Statue Of Equality) అంటూ భర్తతో కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. ఇద్దరి ఫొటోపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్లు చేశారు.

Advertisement

తన భర్త రామ్ వీరపనేనితో కలిసి దిగిన ఫొటోపై ఓ నెటిజన్ అసభ్యంగా కామెంట్ చేశాడు. అది చూసిన సింగర్ సునీత తన భర్తపై ఓ నెటిజిన్ చేసిన నెగటివ్ కామెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడికి గట్టిగానే బుద్ధి చెప్పారు సింగర్ సునీత.. ‘నోటి దూల నీది.. నీ భారం భూమిది అంటూ సింగర్ సునీత కౌంటర్ ఇచ్చారు. ఆమె ఇచ్చిన కౌంటర్ కు ఇతర నెటిజన్లు బాగా బుద్ధి చెప్పారంటూ ఆమెను సపోర్టు చేస్తున్నారు.

Advertisement

 

Advertisement
View this post on Instagram

 

Advertisement

A post shared by Sunitha Upadrasta (@upadrastasunitha)

Advertisement

Advertisement

Read Also :  Samantha Diehard Fan : ఈ పాప.. సమంతకు వీరాభిమాని.. పెద్దయ్యాక ఏమవుతావని కీర్తి సురేశ్ అడిగితే.. ఏమందో చూడండి..!

Advertisement
Advertisement