Samantha Diehard Fan : ఈ పాపను చూశారా? సమంతకు వీరాభిమాని అంట.. చిన్నప్పుడే సమంతకు డై హార్డ్ ఫ్యాన్ అంటోంది. పైగా పెద్దాయ్యాక ఏమవుతావు అంటే ఏమి చెప్పిందో చూడండి.. అందాల బ్యూటీ కీర్తి సురేశ్ కూడా పాప మాటలకు ఫిదా అయిపోయింది. ఎలాగైనా సామ్.. ఈ పాపను కలుసుకోవాలంటూ చిన్నారి క్యూట్ వీడియోను హీరోయిన్ కీర్తి సురేశ్ తన ఇన్ స్టా స్టోరీస్‌లో షేర్ చేసింది.. ఇప్పుడా ఆ వీడియో వైరల్ అవుతోంది. సాధారణంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో సమంత ఒకరు. ఆమెకు అబ్బాయిలే కాదు.. అమ్మాయిల్లోనూ అభిమానులు ఎక్కువే.. చిన్నారుల్లోనూ సమంతకు మంచి ఫాలోయింగ్ ఉంది.

ఓటీటీలోనూ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌తో సమంత పాన్ ఇండియన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఇటీవల నాగచైతన్యతో విడాకుల ప్రకటన తర్వాత సమంత ఎప్పుడూ ఏదో విషయంలో వార్తల్లో నిలుస్తూనే ఉంది. చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సామ్.. లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. స్వీట్జర్లాండ్ ట్రీప్ ఎంజాయ్ చేస్తూ స్కైయింగ్ వీడియోలను అభిమానులతో షేర్ చేస్తోంది. సమంతకు యూత్‍లో క్రేజ్ అంతాఇంతా కాదు.. యూత్ మాత్రమే కాదు.. చిన్నారుల్లోనూ డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.
ఓ పాపను పాపను పెద్దయ్యాక ఏమవుతావు కీర్తి సురేశ్ (Keerthi Suresh) అడగ్గా.. సమంత అవుతానని చెప్పేసింది.. ఈ వీడియోను కీర్తి సురేష్ తన ఇన్‌స్టాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది. కీర్తి సురేష్ సినిమా షూటింగ్ సెట్‌లో చిన్నారితో మాట్లాడింది. నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు కీర్తి సురేశ్ ఆ పాపను అడిగింది. నేను పెద్దాయ్యాక సమంత అవుతాను అని చెప్పింది.
సమంతకు తాను వీరాభిమనిని (Samantha Diehard Fan) చెప్పడంతో ఆ వీడియోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది కీర్తి సురేష్.. సమంత మీ అభిమాని.. మీరు ఆమెను ఒకసారి కలుసుకోవాలి సామ్’ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ వీడియోను చూసిన సమంత రిప్లై ఇచ్చింది. ఇంతకీ ఎవరా క్యూటీ బేబీ అని అడిగింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే…
Read Also : Kajal Agarwal : అరుదైన గౌరవం దక్కించుకున్న ‘కాజల్ అగర్వాల్’… ఏంటంటే ?