Singer Sunitha : రెండో భర్త కోసం ఎవరూ చేయలేని పనిచేస్తున్న సింగర్ సునీత.. అదేంటో తెలిస్తే షాకవ్వాల్సిందే..!

Singer Sunitha : కోయిల గొంతు కన్నా మధురమైన స్వరం ఆమెది. ఆమెడి పాడితే లోకమే పాడుతుంది. అంత అందంగా పాడుతుంది. ఆమె పాట వింటే ఎవరైనా దాసోహం కావాల్సిందే. ఆమె ఎవరో కాదు.. మన సింగర్ సునీత (Singer Sunitha). తన పాటలతోనే కాదు.. ఎంతోమందికి తన గాత్రాన్ని అందించింది. సింగర్ సునీత పాడిన ఎన్నో పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పటికీ ఆమె మెలోడీ సాంగ్స్ అంటే పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు. పాటలతోనే తన అందంతో కూడా ఎంతోమందిని ఆకట్టుకుంది. తెలుగింటి అమ్మాయిగా పేరు తెచ్చుకున్న సింగర్ సునీతకు చిన్నప్పుడే పెళ్లి అయింది.

Singer Sunitha Wants to Give Surprise Birthday Gift to Her Husband Ram Veerapaneni
Singer Sunitha Wants to Give Surprise Birthday Gift to Her Husband Ram Veerapaneni

అనుకోని కారణాలతో మొదటి భర్తతో విడాకులు తీసుకోవాల్సి వచ్చింది. అప్పటికే ఆమె పిల్లలు ఉన్నారు. కొన్నాళ్ల తర్వాత పిల్లల బలవంతం మీద రెండో పెళ్లి చేసుకునేందుకు అంగీకరించింది. అలా తన జీవితంలో రెండో భర్తగా మ్యాంగో వీడియో అధినేత రామ్ వీరపనేని అడుగుపెట్టాడు. అప్పటినుంచి సింగర్ సునీత లైఫ్ మళ్లీ ఆనందంగా సాగుతోంది. కానీ, సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకోవడంపై సోషల్ మీడియాలో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. భర్తతో కలిసి ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడుపుదామనుకుంటే.. వీరిద్దరి జంటపై అసభ్యంగా ట్రోల్స్ చేశారు. అయినా సింగర్ సునీత అధైర్యపడలేదు.

Singer Sunitha : భర్తకు బర్త్‌డే సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చేందుకు ప్లాన్.. 

అలాంటి ట్రోల్స్ గురించి ఆలోచించకుండా వారికి తగినట్టుగా కౌంటర్ ఇచ్చింది. ఎవరి లైఫ్ వారిది.. మనం సంతోషంగా ఉంటే నచ్చనివారు ఎవరో ఒకరు ఇలా మనపై విమర్శలు చేస్తుంటారు. అలాంటివారి గురించి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ పోతే చాలు.. నా లైఫ్ నా ఇష్టం.. అంటూ తన లైఫ్ ఎంజాయ్ చేస్తోంది సునీత. అయితే, ఇప్పుడు రెండో భర్త అయిన రామ్ పుట్టినరోజు దగ్గరపడుతోంది. అయితే భర్త కోసం ఏదో ఒకటి చేయాలని సునీత భావించందట..

Advertisement
Singer Sunitha Wants to Give Surprise Birthday Gift to Her Husband Ram Veerapaneni
Singer Sunitha Wants to Give Surprise Birthday Gift to Her Husband Ram Veerapaneni

అందుకే భర్త పుట్టినరోజున మంచి సర్ ప్రైజ్ ఇవ్వాలనకుందట.. భర్తకు తెలియకుండా రామ్ చిన్ననాటి స్నేహితులను ఒకచోట చేర్చేందుకు ప్లాన్ వేసిందట.. గెట్ టుగెదర్ ప్లాన్ చేసి.. పుట్టినరోజున సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుందట.. ఇందులో భాగంగా ముందుగానే రామ్ స్నేహితులు ఎక్కడ ఉన్నారో తెలుసుకుని వారిందరిని భర్త పుట్టినరోజుకు ఇన్వైట్ చేస్తుందట.. ఇంతకీ సింగర్ సునీత చేస్తున్న ఈ బర్తడే సర్ ప్రైజ్ పార్టీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే అప్పటివరకూ ఆగాల్సిందే.

Read Also : Niharika Konidela : శ్రీజ బాటలో నిహారిక.. మెగా డాటర్ భర్తను నిజంగానే దూరం పెట్టేసిందా?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel