Liger Disaster : విజయ్ దేవరకొండ చేసిన పనికి పుట్టెడు కష్టాల్లో పూరి జగన్నాథ్.. డబ్బులు తిరిగి ఇచ్చేయ్..!

Updated on: October 27, 2022

Liger Disaster : టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన లైగర్ మూవీ డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. లైగర్ మూవీ కోసం ఎంతగా ప్రమోషన్ చేసిన బాక్సాఫీసు వద్ద తేలిపోయింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ మూవీలో అనన్య పాండే జోడీగా నటించింది. ఈ మూవీపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు పూరి. కానీ, విజయ్ దేవరకొండ అత్యుత్సాహం, ప్రవర్తన కారణంగా మూవీ అట్టర్ ఫ్లాప్ అయిందంటూ సినీ విమర్శలు ఏకిపారేస్తున్నారు. విజయ్ తన మాటలతో ప్రవర్తనతో పాటు సినిమా భారీ హిట్ అవుతుందని ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ప్రమోట్ చేశాడు.

KRK Slams Vijay Deverakonda Saying Liger Was A Disaster
KRK Slams Vijay Deverakonda Saying Liger Was A Disaster

పాన్ ఇండియా రేంజ్‌లో బాలీవుడ్‌లో కూడా అదేపనిగా ప్రమోట్ చేశారు. సినిమా ప్రమోషన్ల సమయంలో విజయ్ తీరుపై విమర్శలు వచ్చాయి. లైగర్ మూవీ రిలీజ్ అయ్యాక అందులో విజయ్ చెప్పింది కొంత శాతం లేకపోవడంతో సినిమా డిజాస్టర్ అయింది. లైగర్ మూవీపై భారీ అంచనాలు కలిగేలా విజయ్ అతిగా మాట్లాడకపోతే యావరేజ్ గా ఆడేదని సినీ క్రిటిక్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. విజయ్ కారణంగానే లైగర్ ఫ్లాప్ అయిందని విమర్శిస్తున్నారు. లైగర్ ఫ్లాప్ తర్వాత విజయ్ దేవరకొండ పెద్దగా మీడియా ముందుకు కూడా రావట్లేదు. ఒకవేళ వచ్చినా మౌనంగానే ఉంటున్నాడు.

Liger Disaster : ఫ్లాప్ అయ్యిందే నీవల్లా.. పూరిని అలా వదిలేస్తావా?

లైగర్ ఫ్లాప్ కావడంతో ఈ మూవీ కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ భారీగా నష్టం వచ్చింది. నష్టాన్ని పూడ్చాలంటూ వారంతా పూరి జగన్నాధ్ చుట్టూ తిరుగుతున్నారు. చివరికి పూరి ఇంటివద్ద కూడా ధర్నా చేస్తానని బ్లాక మెయిల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయంలో పూరి కూడా వారికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. బాలీవుడ్‌లోనూ లైగర్ ఇష్యూనే పెద్ద టాపిక్ అయింది. కరణ్ జోహార్ ఈ మూవీకి నిర్మాతగా వ్యవహరించాడు. లైగర్ హిందీలో నిర్మించారు. ఆ తర్వాతే తెలుగు వెర్షన్ లో రిలీజ్ చేశారు. బాలీవుడ్ మూవీ కావడంతో లైగర్ ఫ్లాప్ పెద్ద చర్చకు దారితీసింది.

Advertisement
KRK Slams Vijay Deverakonda Saying Liger Was A Disaster
KRK Slams Vijay Deverakonda Saying Liger Was A Disaster

సినిమా రిలీజ్ కావడానికి ముందు ఓవర్‌గా మాట్లాడిన విజయ్ దేవరకొండ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నాడంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి లైగర్ మూవీ ఫ్లాప్ కావడానికి మూలం కారణం విజయ్ దేవరకొండ అంటూ సినీ విమర్శకుడు KRK విమర్శించారు. ఈ మూవీలో హీరోగా నటించిన విజయ్ కు ఎక్కువ బాధ్యత ఉంటుందని, ఆయనకు భాగం ఉందని అన్నారు.

విజయ్ దేవరకొండ యాటిట్యూడ్, ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే లైగర్ మూవీ ఫ్లాప్ టాక్ అందుకుందని అన్నారు. సినిమాతో తనకు సంబంధం లేదన్నట్టుగా పూరిని అలా వదిలేయడం సరైన పని కాదంటూ KRK విమర్శించారు. ఈ మూవీ పరాజయానికి బాధ్యతగా విజయ్ పారితోషకంగా తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై విజయ్ స్పందిస్తాడేమో లేదో చూడాలి.


Read Also :  Niharika Konidela : శ్రీజ బాటలో నిహారిక.. మెగా డాటర్ భర్తను నిజంగానే దూరం పెట్టేసిందా?!

Advertisement

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Join our WhatsApp Channel