Shravana Masam:శ్రావణమాసం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసంగా పరిగణిస్తారు. ఈ క్రమంలోనే శ్రావణ శుక్రవారం అమ్మవారికి ఎంతోమంది భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు మనపై ఉండి సకల సంపదలు కలిగిస్తారని భావిస్తారు.అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణమాసంలో మనకు తెలిసి తెలియకుండా కొన్ని తప్పులు చేయడం వల్ల అమ్మవారి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇలా అమ్మవారు ఆగ్రహానికి గురైతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది మరి ఆ తప్పులు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…
*శ్రావణమాసంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం మనం పూజ చేసే సమయంలో మన ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉండాలి. సాయంత్రం సమయంలో ఎప్పుడు కూడా తలుపులు మూసి వేయకూడదు. సంధ్యా సమయంలో లక్ష్మీదేవి సంచరిస్తూ ఉంటుందని ఆ సమయంలో మనం తలుపులు వేసి ఉంచడం వల్ల అమ్మవారు వెనుతిరిగి వెళ్ళిపోతుందని అందుకే తలుపులు వేయకూడదని చెబుతారు.
*పొరపాటున శ్రావణ శుక్రవారం లేదా మిగిలిన శుక్రవారం లో కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు అలాగే ఎవరికి అప్పు ఇవ్వకూడదు ఇలా ఎవరికైనా అప్పు ఇవ్వడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి మొత్తం బయటకు వెళ్ళిపోతుందని చెబుతారు. అందుకే ఎవరికి అప్పులు ఇవ్వకూడదు.
*శ్రావణమాసంలో అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజల నిర్వహిస్తారు కనుక శ్రావణమాసంలోనే కాకుండా ఇతర రోజులలో కూడా మహిళల పట్ల ఎవరు దురుసుగా అసభ్యకర పదజాలంతో వ్యవహరించకూడదు.ప్రతి స్త్రీని దేవత సమానంగా భావించి గౌరవించడం వల్ల అమ్మవారి కరుణ కటాక్షాలు కూడా మనపై ఉంటాయి.
Shravana Masam:
*శుక్రవారం కొన్ని దానాలు చేయడం ఎంతో మంచిది అయితే డబ్బును కానీ చక్కెరను కానీ ఎట్టి పరిస్థితులలో దానం చేయకూడదని చెబుతారు.పంచదార శుక్ర గ్రహానికి సంబంధించినది కనుక శుక్రవారం పంచదారను దానం చేయటం వల్ల మన ఇంట్లో సంతోషాలు దూరం అవుతాయి.