...

Devatha: మాధవ చేసిన పనికి షాక్ అయిన రాధ.. సంతోషంలో దేవుడమ్మ..?

Devatha: తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధను ఆదిత్య తన ఇంటికి తీసుకుని వెళ్తాడు.

ఈరోజు ఎపిసోడ్ లో రాధను, తన ఇంటికి తీసుకెళ్లిన ఆదిత్య ఇంట్లో ఎవరూ లేక పోయేసరికి బాధపడతాడు. రాధ తనను పంపించండి అంటూ ఆదిత్య ని వేడుకుంటుంది. కానీ ఆదిత్య మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్ళద్దు ఇక్కడే ఉండాలి అని అంటాడు.

అప్పుడు ఆదిత్య నువ్వు మాధవ ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు అని అనడంతో వెంటనే రాధ నేను ఇంట్లో నుంచి బయటికి రావాలి అంటే దేవి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేవి మాధవనే తన తండ్రి అనుకుంటూ ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ.

మరొకవైపు దేవుడమ్మ కుటుంబం గుడికి వెళ్తారు. అప్పుడు దేవుడమ్మ అందరిని లోపలికి వెళ్ళమని చెప్పి తాను పూలు తీసుకుని వస్తాను అని బయటకు వెళుతుంది. ఇంతలోనే ఒక ఆమె వచ్చి మీ కోడలు రుక్మిణి ఈ మధ్యనే కనిపించింది అని అనడంతో దేవుడమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది.

అప్పుడు దేవుడమ్మ ఆనందంతో ఎక్కడ కనిపించింది అని అడగగా ఇంతలోనే ఆమె పూజా సమయం అయ్యింది అని అక్కడి నుంచి వెళ్లి పోతుంది. వెంటనే దేవుడమ్మ పూజారి చెప్పిన మాటలు తలుచుకొని నిజమే అని సంతోషపడుతుంది. ఆ తర్వాత ఆదిత్య కారు ఆపగానే రాధా మౌనంగా ఉంటుంది.

ఎందుకు నువ్వు రాను అంటున్నావు చిన్మయి నీ కూతురు కాదు కదా అసలు విషయం చెప్పేసి ఇంట్లోంచి బయటకు రావచ్చు కదా అని అనడంతో అప్పుడు రాధా గతంలో జరిగిన విషయాన్ని చెబుతుంది. ఇప్పుడు రాలేను సమయం వచ్చినప్పుడు తానే వస్తాను అని అనడంతో ఆదిత్య బాధపడి అక్కడనుంచి వెళ్ళి పోతాడు.

మరొకవైపు దేవుడమ్మ గుడిలో దేవుడిని దర్శించుకున్న తరువాత అక్కడ పూజారికి నిజం చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు పూజారి మీ కోడలు మీ ఇంటికి రావాలి అంటే ఉపవాసం చేయాలి అని అనడంతో వెంటనే దేవుడమ్మ సరే అని అంటుంది.

మరొకవైపు మాధవ,రాధ రూమ్ లోకి వెళ్లి రాధ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక రేపటి ఎపిసోడ్ లో రాధ పెళ్లి ఫోటోలను చింపి రాధకే చూపిస్తాడు మాధవ. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి