Devatha: బుల్లితెర ప్రసారమౌతున్న దేవత సీరియల్ రోజు రోజుకు ఎంతో రసవత్తరంగా మారుతూ పెద్దఎత్తున ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేటి ఎపిసోడ్ మరింత ఆసక్తి కరంగా మారింది. నేటి ఎపిసోడ్ లో భాగంగా దేవుడమ్మ తన వదిన అన్న మాటలను గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. అదే సమయంలో అక్కడికి సూరి, రాజ్యం వచ్చినది కూడా చూడకుండా దేవుడమ్మ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇలా ఒక్కొక్కరుగా అక్కడికి వచ్చి చేరుకుంటారు.ఇక ప్రసాద్ అక్కడికి వచ్చి మా అక్క అన్న మాటలను తలుచుకుని బాధ పడుతున్నావా దేవుడమ్మా అని ప్రశ్నించగా అవును అని సమాధానం చెబుతుంది.
ప్రసాద్ అన్న మాటలకు సూరి మాట్లాడుతూ అక్క అలా ఎందుకు మాట్లాడిందో తెలియదు కానీ ఆమె మాట్లాడిన మాటలలో ఒక నిజం ఉంది అంటాడు. నాకు పిల్లలు లేకపోయినా ఆదిత్య ఉన్నాడు కనుక మన వారసత్వం కొనసాగుతోంది. కానీ ఆదిత్యకు పిల్లలు లేకపోతే మన వారసత్వం ఇక్కడే ఆగిపోతుంది అంటాడు.అదే సమయంలో నిజం తన తల్లికి చెప్పాలని ఆదిత్య ఎంతో సంతోషంగా వస్తుండగా దేవి ఆఫీసర్ అని పిలవగానే తనని దగ్గరకు చేర్చుకుని తనకు ముద్దులు పెడుతూ తన పై ప్రేమను కురిపిస్తాడు. ఇక ఆదిత్య వెంటనే వెళ్లి తన తల్లికి రుక్మిణి బతికే ఉందని చెప్పాలనుకుంటాడు.
ఆదిత్య మనసులో మాట్లాడుకుంటూ అమ్మకి చెప్పడం ఎందుకు సరాసరి రుక్మిణి తీసుకెళ్లి చూపిస్తే సరిపోతుంది అని రాధా ఇంటికి వెళ్తాడు.ఇక రాదా పిల్లలిద్దరికీ అన్నం తిని పెడుతూ ఎంతో సంతోషంగా కబుర్లు చెబుతూ ఉండగా అక్కడే ఉన్న మాధవ్ రాధలోనే కాదు,తన మాటల్లో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి అని అనుకుంటాడు. ఇక పిల్లలు కథ చెప్పమని అడగగా రాధా రామాయణం గురించి కథ చెబుతూ తన మాట్లాడే ప్రతి ఒక్క మాట మాధవ్ కి తగిలేలా మాట్లాడుతుంది.
అప్పుడే ఆదిత్య కారులో అక్కడికి రావడంతో రాధ ఎంతో సంతోషపడి నేను కూడా మీతో మాట్లాడాలి అనుకున్నాను అంటూ ఆదిత్యతో అంటుంది.వెంటనే ఆదిత్య చాలా సంతోషంగా తన చేయి పట్టుకొని కారులో ఎక్కించుకుని వెళ్ళాడు.రుక్మిణీ ఎక్కడికి అని అడుగుతున్నా నువ్వేం మాట్లాడకు అంటూ తనను సరాసరి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లి అమ్మ అమ్మ అంటూ గట్టిగా పిలిచినా ఇంట్లో నుంచి ఎవరూ రాకపోయేసరికి ఇంట్లో ఎవరూ లేరనుకుని రుక్మినిని అక్కడే ఉన్న దేవుడి దగ్గరికి తీసుకెళ్లి కుంకుమ పెట్టి నువ్వు నా భార్యవి అని నాకు తెలిసింది అంటూ మరోసారి తనని భార్యగా స్వీకరిస్తాడు.ఇక ఆదిత్య మాటలు విన్న రుక్మిణీ ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ పూర్తికాగా వచ్చే ఎపిసోడ్ లో కథ మలుపు తిరుగుతుందో తెలియాల్సి ఉంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World