Devatha November 10 Today Episodea : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దేవుడమ్మ రుక్మిణి బతికే ఉంది అన్న విషయం తెలుసుకొని షాక్ అవుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో చిన్మయి రుక్మిణి దగ్గరికి వెళ్లి మాధవ రూమ్ కి తీసుకొని వెళుతుంది. అప్పుడు ఎందుకు చిన్మయి అని చెప్పినా కూడా వినిపించుకోకుండా బలవంతంగా అక్కడికి పిలుచుకొని వెళ్తుంది. అప్పుడు ఏమైంది చిన్మయి అని అనగా అక్కడ లగ్నపత్రిక తాళిబొట్టు చూపించడంతో అది చూసి రాధ ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడు అమ్మ మా నాన్న మిమ్మల్ని ఇంకా వేధిస్తూనే ఉన్నాడు ఇకనుంచి నువ్వు వెళ్ళిపోండి అని అంటుంది చిన్మయి.

Devatha November 10 Today Episode
అప్పుడు రాధ ఇవన్నీ చూసిన తర్వాత ఇక్కడే ఉన్నాను అంటే నాకే మంచిది కాదు ఎలా అయినా వెళ్ళిపోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాధ. ఆ తర్వాత రాధ ఒకచోట కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో భాగ్యమ్మ అక్కడికి వచ్చి ఏమైంది బిడ్డ అని అనగా ఈ ఇంట్లో నుంచి వెళ్తే కానీ ఆ మాధవ్ సారు మాట వినేలా లేడు అనడంతో వెంటనే భాగ్యమ్మ నేను ఆ విషయం ఎప్పుడో చెప్పాను బిడ్డ అని మాట్లాడుతూ ఉండగా ఇంతలో రాధకి ఒక ఫోన్ రావడంతో కంగారు పడి అవునా వస్తున్నాను అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
అప్పుడు భాగ్యమ్మ ఇంత పిలిచినా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక చోటికి వెళ్లిన రాధ అక్కడ చుట్టూ మొత్తం వెతుకుతూ ఉండగా అక్కడ ఎవరు కనిపించరు. ఇంతలోనే అక్కడికి దేవుడమ్మ రావడంతో అది చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది రాధ. అత్తమ్మ అనడంతో నీకు ఇంకా ఈ అత్తమ్మ గుర్తుకు ఉందా అని అడుగుతుంది దేవుడమ్మ. నువ్వు చనిపోయావు అని అందరూ అంటున్నారు నమ్మకుండా పదేళ్ల నుంచి గుళ్ళు గోపురాలు తిరుగుతున్న ఈ అత్తమ్మని ఎందుకు దూరం పెట్టావు బ్రతికి ఉండే చచ్చావని అందరిని నమ్మించి మా దగ్గరలోనే ఉండి కూడా ఎందుకు ఇలా నన్ను మోసం చేశావు అని నిలదీస్తుంది దేవుడమ్మ.
Devatha నవంబర్ 10 ఎపిసోడ్ : దేవుడమ్మకు అసలు నిజం చెప్పినా రుక్మిణి..
ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినప్పుడు గర్భవతి కదా అని అనగా బిడ్డ పుట్టింది అని చెబుతుంది రాధ. అప్పుడు దేవుడమ్మ ఇంటికి రా నిన్ను ఎవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాను అని అంటుంది. అప్పుడు దేవుడమ్మ మాట్లాడుతూ ఉండగానే రాధ ఏం పట్టించుకోకుండా ఎమోషనల్ అవుతూ అక్కడినుంచి వెళ్ళిపోతుంది. మరొకవైపు సత్య ఆలోచిస్తూ కూర్చుండగా ఇంతలో రాజమ్మ అక్కడికి వచ్చి ఎందుకు సత్య ఎప్పుడు ఏదో ఒక విషయంలో బాధపడుతూనే ఉంటావు.
ఆదిత్యను అనుమానిస్తూనే ఉంటావు అని మాట్లాడుతూ ఇంతలోనే కిచెన్ లో పని ఉంది అని అక్కడికి వెళుతుంది రాజమ్మ. ఇంతలోనే ఒక అతను ఆదిత్య సార్ బ్రీఫ్ కేసు మర్చిపోయాడు అని సత్యకు ఇచ్చి వెళ్లిపోతాడు. అప్పుడు ఆ బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూడడంతో అందులో రుక్మిణి ఫోటో చూసి కోపంతో రగిలిపోయిన సత్య ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకుంటాను పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది అని రుక్మిణి దగ్గరికి కోపంగా బయలుదేరుతుంది. అప్పుడు రాజమ్మ ఎంత పిలుస్తున్న పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
మరొకవైపు రామ్మూర్తి జానకి టెన్షన్ పడకు మనం మెరుగైన వైద్యం కోసం కేరళ వెళ్తున్నాము అని మాట్లాడుతూ ఉంటాడు. కొద్దిరోజుల్లోనే మళ్లీ మనం వెనక్కి తిరిగి వస్తాము అని అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత రాధా ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చి ఒకచోట కూర్చుని ఏం చేయాలి ఇప్పుడు అత్తమ్మ బాధపెట్టాను ఇప్పుడు ఇంటికి రమ్మని పిలుస్తోంది ఇప్పుడు రాకపోతే సీదా అందర్నీ పిలుచుకొని ఇక్కడికి వస్తుంది వెళ్తే నా చెల్లెలు కాపురం ఏమవుతుంది అని ఎమోషనల్ అవుతూ ఉంటుంది రాదా.