Devatha November 9 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవి దేవుడమ్మ దగ్గర నుంచి సంతోషంగా ఇంటికి వెళుతుంది.
ఈరోజు ఎపిసోడ్ లో మాధవ సత్య మాట్లాడిన ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో చిన్మయి అక్కడికి వచ్చి నాన్న నాకు దారిలో పది రూపాయలు దొరికింది నేను తీసుకు వచ్చాను. కానీ తెచ్చిన తర్వాత అది నా ఫ్రెండ్ ది అని తెలిసింది నాన్న ఇప్పుడు ఏం చేయాలి అని అడగగా వెంటనే మాధవ్ ఇచ్చేయ్ అని అంటాడు. అప్పుడు చిన్మయి నాకు ఇవ్వాలని అనిపించడం లేదు నాన్న అనడంతో పరాయి సొమ్ము ఇవ్వకపోతే తప్పు అని అంటాడు మాధవ్.
వెంటనే చిన్మయి మళ్ళీ ఆ తప్పునువ్వు ఎందుకు చేస్తున్నావు నాన్న అని అనడంతో ఒక్కసారిగా షాక్ అవుతాడు మాధవ్. అమ్మ నాకు అసలు అమ్మ కాదు తనకు మనం ఏమీ కాదు అలాంటప్పుడు ఎందుకు నాన్న అమ్మని దక్కించుకోవాలని చూస్తున్నావు అని అంటుంది. ఇప్పుడు మాధవ్ షాక్ లో అమ్మ కాకపోవడం ఏంటి చిన్నయి అనడంతో అంతా నాకు తెలుసు నాన్న రాధ అమ్మ నా సొంత అమ్మ కాదు అని తెలుసు దేవి నా చెల్లి కాదు అన్న విషయం తెలుసు అలాగే నీ చేతి పై ఉన్న పచ్చబొట్టు నిజం కాదు అని కూడా తెలుసు అనడంతో మాధవ్ ఒకసారి షాక్ అవుతాడు.
ఎందుకు నాన్న అమ్మ నీ చెల్లిని బాధ పెడుతున్నావు. అమ్మ ఆ ఆదిత్య అంకుల్ భార్య అన్న విషయం నాకు తెలుసు దేవి ఆదిత్య అంకుల్ కూతురు వాళ్ళని విడదీసి పాపం చేయొద్దు నాన్న అని అంటుంది. నువ్వు ఇంత చెడ్డవాడివి అంటే నాకు బాధగా ఉంది అనడంతో వెంటనే మాధవ్ కోప్పడి ఇకనుంచి లోపలికి వెళ్ళు చిన్మయి అని అంటాడు. మరొకవైపు దేవుడమ్మ వాళ్ళ కారు చెడిపోవడంతో పక్కనే ఉన్న గుడి దగ్గర వచ్చి కూర్చుంటుంది. అప్పుడు అక్కడ ఉన్న ఒక అతను నిన్న ఆఫీసర్ సారు అతని భార్య వచ్చి దీపాలు వత్తులు తీసుకున్నారు 2000 నోటు ఇచ్చారు చిల్లర లేదంటే మళ్లీ తీసుకుంటా అని చెప్పి వెళ్లిపోయారు అనడంతో దేవుడమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది.
Devatha నవంబర్ 9 ఈరోజు ఎపిసోడ్ : తప్పు చేస్తున్నావు నాన్న.. చిన్మయి మాటలకు షాకైన మాధవ్..
అప్పుడు సత్య ఆదిత్య అక్కడికి వచ్చారు అని అనుకుంటుంది దేవుడమ్మ. మరొకవైపు రాధ దేవి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. మరొకవైపు దేవుడమ్మ ఇంటికి వెళ్లి రాజమ్మతో సత్య ఆదిత్యల గురించి అడగడంతో ఉన్నవాళ్లు గుడికి వెళ్లి దీపాలు పెట్టారా అని అనగా సత్య అసలు నిన్న బయటికి వెళ్ళలేదు అని చెబుతుంది. అప్పుడు దేవుడమ్మ టెన్షన్ తో పరుగు పరుగున మళ్ళీ గుడి దగ్గరికి వెళ్తుంది.
మరొకవైపు ఆదిత్య దగ్గరికి వెళ్లిన రాధ అసలు విషయాన్ని చెప్పడంతో దేవి ప్రవర్తనలో మార్పు కనిపించింది అసలు విషయం తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటారు ఆదిత్య రుక్మిణి. ఒకవైపు గుడి దగ్గరికి వెళ్లిన దేవుడమ్మ షాప్ అతనికి సత్య ఫోటో చూపించడంతో ఇక్కడికి వచ్చిన ఈమె కాదు అని అనగా వెంటనే రుక్మిణి ఫోటో చూపిస్తుంది. అప్పుడు ఆ షాప్ అతను ఈమెనే అనడంతో దేవుడమ్మ ఒక్కసారిగా షాక్ అవుతుంది. మరొకవైపు ఆదిత్య,సత్య ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.
అప్పుడు సత్య దేవి నీ కూతురా ఆ మాధవ్ కూతురుని నీ కూతురు అని చెప్పడానికి సిగ్గు లేదా అనడంతో సత్య చంప చెల్లుమనిపిస్తాడు ఆదిత్య. దేవి ఎవరో కాదు నా రక్తం పంచుకొని పుట్టిన నా బిడ్డ దేవి అనడంతో తత్యా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక్కడికి పిలుచుకొని రావచ్చు కదా ఆదిత్య అనడంతో ఇప్పుడు కాదు ఇంకా సమయం ఉంది అని అంటాడు ఆదిత్య. అప్పుడు సత్య మరి అక్క ఇక్కడికి వస్తే నా స్థానం ఏంటి అక్క స్థానం ఏంటి అని తలుచుకొని ఏడుస్తూ ఉంటుంది.
Tufan9 Telugu News And Updates Breaking News All over World