Janaki Kalaganaledu: తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో జ్ఞానాంబ, జానకి పై గట్టిగా అరుస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో జ్ఞానాంబ,జానకి అని గట్టిగా అరవడంతో ఇంతలో జానకి అక్కడికి వస్తుంది. అప్పుడు జానకి చేతిలో ఉన్న పుస్తకాన్ని చూసి ఈ పుస్తకం ఎవరిది అనే జానకి నిలదీయగా నాది అని చెబుతుంది. అప్పుడు జ్ఞానాంబ తోరాలు పడేసి పుస్తకాలను లోపల పెట్టింది అనడంతో అందరూ షాక్ అవుతారు.
అప్పుడు జానకి లేదు అత్తయ్య నేను పెట్టలేదు అని చెబుతుంది. ఇంతలోనే మల్లికా అవకాశం చిక్కింది కదా అని జానకిపై లేనిపోని చాడీలు చెబుతుంది. చదువు విషయంలో సాంప్రదాయాన్ని పక్కన పెట్టావు రేపు భర్తను పక్కన పెట్టావా అంటూ జానకిని నానా మాటలు అని బాధ పెడుతుంది జ్ఞానాంబ. అప్పుడు జానకి తాను ఆ పుస్తకాలు అక్కడ పెట్టలేదు అని ఎంత చెప్పినా కూడా జ్ఞానాంబ.
అప్పుడు మల్లికా మీరు పెట్టిన షరతులలో జానకి ఒక తప్పు చేసింది వెళ్లి అందులో ఒక సంఖ్యను చెరిపేస్తాను అని అంటుంది. వెంటనే మల్లికార్జున పీయడానికి వెళుతూ ఉండగా జానకి, మల్లిక చేతులకు ఉన్న పసుపును గమనిస్తుంది. అప్పుడు జానకి మళ్ళీ కని పిలిచి తన గదిలో ఉన్న నెక్లెస్ ఎక్కడ పెట్టావు అని అడుగుతుంది. అప్పుడు జానకి మాటలకు మల్లిక ఒకసారిగా షాక్ అవుతుంది.
అప్పుడు మల్లికా తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు జానకి నా నెక్లెస్ కు పసుపు కుంకుమ పెట్టి పూజ చేసి అక్కడ పెట్టాను అని అంటుంది. మల్లికా నేను తీయలేదు అని అనడంతో అది ఇవ్వకుంటే పోలీస్ కేసు పెడతాను అని అంటుంది జానకి. అప్పుడు మల్లిక మాత్రం తీయలేదు అని బుకాయిస్తుంది.
దీంతో వెంటనే జానకి నువ్వు ఆ నెక్లెస్ తీయనప్పుడు నీ చేతికి పసుపు ఎక్కడిది అనడంతో బుక్ తీసి లోపల పెట్టేటప్పుడు పసుపు అయ్యింది అని మల్లిక నోరు జారుతుంది. అప్పుడు ఆ తప్పు చేసింది మల్లికానే అని తెలుసుకొని అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు మల్లిక తప్పు తెలుసుకుని జ్ఞానాంబ కాళ్లపై పడి క్షమించమని అడుగుతుంది.
అప్పుడు మల్లికను చెడమడ ఇట్టి జానకిని క్షమించమని కోరి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జ్ఞానాంబ. ఆ తర్వాత మల్లికా బట్టల షాప్ దగ్గరికి వెళ్లి విష్ణువుతో విడాకులు ఇవ్వమని కాసేపు మాటల యుద్ధం చేస్తుంది. మరొకవైపు రామచంద్ర తన తల్లి జానకి కి పెట్టిన షరతులను తలుచుకుంటూ ఏదో పరధ్యానంతో స్వీట్ షాప్ దగ్గరికి వచ్చిన వ్యక్తికి డబ్బులు ఎక్కువగా ఇస్తాడు.
వెంటనే అతను డబ్బులు ఎక్కువగా ఇస్తున్నావ్ రామచంద్ర అని అనగా వెంటనే తేరుకుంటాడు. ఇంతలోనే జానకి అక్కడికి వచ్చి రామచంద్ర తో సరదాగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తారు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World