Rain alert : రానున్న మూడు రోజుల్లో తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న దక్షిణ ఒడిశా-ఉత్తరాంధ్ర దాని పరిసర ప్రాంతాల్లో ఉ్న అల్ప పీడనం ఇవాళ ఒడిశా తీరంలోని వాయువ్య బంగాళ ఖాతంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ అల్ప పీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిమీల వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరుగుతుందని వివరించింది. ఈ అల్ప పీడనం రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని అంచనా వేసింది. వీటి ప్రభావం వల్ల తెలంగాణలో భారీ వర్షంతో పాటు.. ఈరోజు, రేపు అతిభారీ, అత్యంత భారీ వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని సంచాలకులు చెబుతున్నారు.
Rain alert : అత్యంత భారీ వర్షాలు బంగాళఖాతంలో అల్ప పీడనం ….
బంగాళఖాతంలో అల్ప పీడనం ఒడిశా తీరానికి ఆనుకుని అల్ప పీడనం కొనసాగుతోందని ఏపీ వాతావరణ శాఖ అధికారులు తెలిపరు. రానున్న రెండు రోజుల్లో అది మరింతగా బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటు మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, క-ష్టా, ఎన్టీఆఱ్, గుంటూరు జిల్లాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని తెలిపారు.
Read Also : Telangana Rain Holidays : తెలంగాణలో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెలవులు!