Telugu NewsLatestTelangana Rain Holidays : తెలంగాణ‌లో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెల‌వులు!

Telangana Rain Holidays : తెలంగాణ‌లో రేపటినుంచి 3 రోజులు స్కూళ్లకు సెల‌వులు!

Telangana Rain Holidays : తెలంగాణలో ఎడతెగకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రేపటి నుంచి.. జూలై 11 నుంచి జూలై 13 వరకు (సోమవారం, మంగళవారం, బుధవారం) మూడు రోజుల పాటు విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

CM KCR announces Three Days Holidays for Telangana
CM KCR announces Three Days Holidays for Telangana

మరోవైపు.. తెలంగాణలో మరో మూడు రోజులు భారీవర్షాలు ఉండటంతో వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఉత్తర తెలంగాణలో వాతావరణ పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని, మొత్తం 13 జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో వర్షాల పరిస్థితి, చేపట్టిన చర్యలు, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది.

Advertisement

Telangana Rain Holidays : తెలంగాణ‌లో రేపటినుంచి విద్యా సంస్థలకు సెల‌వులు

ఈ సమావేశంలో పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కుండపోత వానలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతాలు నమోదయ్యాయి. తెలంగాణలో ప్రధాన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది.

కాళేశ్వరం, శ్రీరాంసాగర్, కడెం ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టులకు వరద నీరు భారీగా చేరుతోంది. ఉత్తర తెలంగాణలో పరిస్థితి తీవ్రంగా ఉందని వివరించింది. మొత్తం 13 జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. గడచిన 24 గంటల వ్యవధిలో అత్యధికంగా 31.3 సెం.మీ. మేర వర్షపాతం నమోదైంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. భారీ వర్షాలతో భద్రాచలంలో గోదావరి నీటి మట్టం పెరుగుతోంది. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

Advertisement

Read Also : Rainy Season : అసలే వర్షాకాలం… వాహనాలపై వెళ్లేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Advertisement
Tufan9 Telugu News
Tufan9 Telugu Newshttps://tufan9.com
Tufan9 Telugu News providing All Categories of Content from all over world
RELATED ARTICLES

తాజా వార్తలు