...

Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. మరో రెండ్రోజుల పాటు ఇదే పరిస్థితి!

Heavy rains : తెలుగు రాష్ట్రాలు అయిన ఏపీ, తెలంగాణల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కరుస్తోంది. ఐదు రోజుల నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. వర్షాలు కారణంగా ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. పలు జిల్లాల్లో ప్రధాన రహదారులు కూడా కొట్టుకుపోయాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న వారి సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రోజులతరబడి వర్షాలకు నానిపోయిన ఇళ్లు కూలిపోతుండగా… నిలువ నీడ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో వర్షం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అత్యధికంగా కుమురం భీం జిల్లా కెరమొరి మండలంలో 16.45 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది.

Heavy rains in andhra pradesh and telangana
Heavy rains in andhra pradesh and telangana

Heavy rains : తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు….

ఆంధ్రప్రదేశ్ లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే బంగాళఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల రాష్ట్రం తడిసి ముద్దైంది. అయితే వర్షాల కారణంగా చెరువులకు గండ్లు పడి కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి. మరికొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే ప్రజలు ఇంట్లో నుంచి బయటకు అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. అయితే మరో రెండ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షం కురుస్తుందని… ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావారణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read Also : Gold prices today : మహిళలకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం, వెండి ధరలు..ఎంతో తెలుసా?