Devatha june 28 today episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ దేవి ఏడిపించడంతో రాధ,మాధవ కు గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.
ఈరోజు ఎపిసోడ్ లో రాధ, ఆదిత్య అన్న మాటలు తలుచుకొని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో దేవీ, చిన్మయి అక్కడికి వచ్చి ఆడుకుంటూ ఉంటారు. అప్పుడు రాధ వాళ్ళిద్దర్నీ పిలుచుకొని పోయి పిండిపదార్థాలు ఇచ్చి ఎవరు ఎక్కువగా తింటారు చూద్దాం అంటూ పందెం వేస్తుంది.
ఆ తర్వాత పిల్లలు ఇద్దరూ సమానంగా తిని ఇవి బాగా చేసావు అమ్మ అని అనగా వెంటనే రాధ ఇవి నేను చేయలేదు ఎవరో ఒక ఆమె తన కోడలు కోసం ఇలా పంచి పెడుతోంది అని అనడంతో పిల్లలు ఇద్దరు అత్త కోడలు కావాలి అని కోరుకుంటారు. వారి మాటలు చాటుగా వింటూ ఉంటాడు మాధవ.
ఆదిత్య ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఎంతలో సత్య అక్కడికి వచ్చి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుతూ ఉండగా ఆదిత్య మాత్రం ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తూ ఉంటాడు. దానితో సత్య, ఆదిత్యను గమనించి ఈ విషయం చెప్పినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను నీకు పిల్లలు కలగడం ఇష్టం లేనట్టుంది అని అనడంతో ఆదిత్య ఏం మాట్లాడకుండా నాకు నిద్ర వస్తుంది అని పడుకుంటాడు.
అప్పుడు సత్య బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు కలెక్టర్ దేవి వాళ్ళ స్కూల్ కి వెళ్లి పిల్లలతో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పిల్లలు ఒక్కొక్కరు ఒక కోరిక అని చెప్పగా అప్పుడు దేవి మా ఆఫీసర్ లెక్క కలెక్టర్ అవుతాను అని అనడంతో ఆ కలెక్టర్ సంతోషంగా ఫీల్ అవుతుంది.
అంతేకాకుండా ఆదిత్య సార్ రోజు స్కూల్ కి వస్తారు వాళ్లతో కలిసి ఆట్లాడుకుంటాడు నా దోస్త్ అని చెప్పడంతో ఆ కలెక్టర్ ఆశ్చర్య పోతుంది. మరొక వైపు రాధా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ రావడంతో రాధ లేచి వెళ్ళి పోతూ ఉండగా అప్పుడు నేను నీతో మాట్లాడడానికి వచ్చాను ఆగు అని చెప్పి గుడి లో జరిగిన విషయం గురించి మాట్లాడుతాడు.
అప్పుడు మాధవ నువ్వు మీ అత్తగారింటికి వెళ్లాలి అనుకుంటున్నావు కానీ మీ అత్త దేవుడు అమ్మాయి నిన్ను ఎలా రాణిస్తుంది. నాతో పాటు ఇంట్లో పదేళ్లు ఉన్నావు మన మధ్య ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా ఊరి జనాలు మనిద్దర్నీ భార్యాభర్తలు అనుకుంటున్నారు కదా అని అనడంతో వెంటనే అన్న మాటలకు ఆలోచనతో పడుతుంది రాధ..
మరొకవైపు దేవుడమ్మ వాచ్మెన్ కూతురికి బాగాలేదు అన్నంతో డబ్బు సహాయం చేస్తుంది. ఆ తర్వాత సత్య ఆ వాచ్మెన్ ఫోన్ ని గమనించి ఆదిత్య వేరే ఫోన్ కదా ఇప్పింది అనడంతో నాకు ఆదిత్య సార్ ఫోన్ ఇవ్వలేదు అని చెబుతాడు వాచ్మెన్. రేపటి ఎపిసోడ్ లో దేవీ రాధా దగ్గరికి వెళ్లి ఆఫీసర్ అవ్వడానికి ఏం చదవాలో నాకు తెలియడం లేదు అనగా వెంటనే రాధ ఆఫీస్ దగ్గరికి వెళ్ళు సరే అని సంతోషంగా బయలుదేరుతుంది దేవి.
Read Also : Devatha june 27 today episode : దేవిని ఏడిపించిన మాధవ.. కోపంతో రగిలి పోతున్న రాధ..?