Devatha july 16 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మాధవ సత్యముందు నటిస్తూ దేవి పై లేని ప్రేమను ఒలకబోస్తాడు.
ఈరోజు ఎపిసోడ్ లో మాధవ తనకు దేవి పై అపారమైన ప్రేమ ఉంది అని దొంగ ప్రేమను చూపిస్తూ సత్య ముందు నటిస్తూ ఉంటాడు. ఇంతలోనే దేవి అక్కడికి వచ్చి మాధవ వాళ్ళు మాట్లాడుతున్న మాటలను వింటుంది. ఇక దేవి రావడం గమనించిన మాధవ మరింత రెచ్చిపోతూ ఎక్కువ ప్రేమ ఉన్నట్లుగా నటిస్తూ ఉంటాడు. అయితే మాధవ మాటలు నిజం అని నమ్మిన సత్య దేవిని పంపించాలి అని నిర్ణయం తీసుకుంటుంది.

ఆ తర్వాత వారి మాటల విన్న దేవి బయటకు వెళ్లి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో ఆదిత్య అక్కడికి వచ్చి ఏం జరిగింది అని అడుగుతాడు. ఇంతలో సత్య అక్కడికి వచ్చి దేవుని వాళ్ళ అమ్మ వాళ్ళింటికి పంపించేద్దాం అని అనగా అప్పుడు ఆదిత్య కాంపిటీషన్ పూర్తి అయ్యాక వెళ్తుందిలే అని అంటాడు. వెంటనే సత్య వాళ్ళ అమ్మ వాళ్లు తనకోసం ఎదురు చూస్తుంటారు అని అనడంతో ఇంతలోనే దేవుడమ్మ అక్కడికి వస్తుంది.
Devatha జూలై 16 ఎపిసోడ్ : ఆదిత్య నుంచి దేవిని దూరం చేసిన మాధవ్…
దేవుడమ్మకు కూడా ఆ విషయం సత్యా చెప్పడంతో దేవుడమ్మ కూడా దేవిని పంపించడానికి ఇష్టపడదు. వారందరూ మాట్లాడుతున్న మాటలన్నీ ఒకవైపు రాధ మరొకవైపు మాదావ వింటూ ఉంటారు. అప్పుడు దేవుడమ్మ కుటుంబం దేవి గురించి మాట్లాడుకుంటూ ఉండగా దేవి తాను వెళ్తాను అని చెప్పి మాధవ దగ్గరికి వెళుతుంది. అది చూసి రాధ కోపంతో రగిలిపోతూ ఉంటుంది.
అప్పుడు దేవి మాధవతో కలిసి వెళుతూ ఉండగా అది చూసి ఆధిత్య బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రాధా అమ్మవారి దగ్గరికి వెళ్లి దేవిని, ఆదిత్యని ఒకటి చేయమని వేడుకుంటూ ఉంటుంది. మరొకవైపు ఆదిత్య ఒంటరిగా కూర్చుని దేవితో గడిపిన క్షణాలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇంతలో సత్య అక్కడికి వచ్చి పదేపదే దేవి వాళ్ళ పాప వాళ్ళ పాప అంటుండగా దేవి నా కూతురు అని ఆ తర్వాత వేరే విషయం చెప్పి కవర్ చేసుకుంటాడు ఆదిత్య.
రాధా కూడా గుడిలో జరిగిన విషయాన్ని తలుచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలో అక్కడికి మాధవ వచ్చి స్వార్థంతో మాట్లాడడంతో వెంటనే రాధా మాధవ పై సీరియస్ అయ్యి ఈ పొద్దు కాకపోయినా రేపొద్దు అయినా కూడా నేను దేవికి తండ్రి ఎవరో చెప్పేస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు ఉదయం పిల్లలిద్దరూ మాధవను చెస్ ఆడటానికి పిలవగా మాధవ పని ఉంది అని చెప్పి బయటకు వెళ్తూ ఉండగా అప్పుడు రామ్మూర్తి దంపతులు ఆడమని చెప్పడంతో అప్పుడు మాధవ పిల్లలతో కలిసి గేమ్ ఆడటానికి ఒప్పుకుంటాడు.
Read Also : Devatha July 15 Today Episode : మాధవ ఎత్తులకు రుక్కు చెక్.. సత్యముందు దేవిపై మాధవ.. దొంగ ప్రేమ!