Devatha July 15 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో రాధ తోటలో అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉండగా భాగ్యమ్మ అడ్డుపడుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రాధను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడం కోసం భాగ్యం మా రాధ ముఖానికి పసుపు పూసి బొట్టు పెడుతుంది. మరొకవైపు రామ్మూర్తి దేవుడమ్మ కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉంటారు. ఇంతలోనే చివరగా దేవుడమ్మ బోనం సమర్పిస్తూ ఉండగా అమ్మవారు వచ్చిన ఒక మహిళ ఆగవే అంటూ దేవుడమ్మ బోనం సమర్పించకుండా ఆపుతుంది.

అన్ని ఇచ్చాను అయినా కూడా నీ మనసులో ఏదో తెలియని బాధ ఉంది. నీ మనసులో ఒక కోరిక ఉంది కాబట్టే నువ్వు కోరిక తీర్చమని బోనం ఎత్తావు కదా అని అనడంతో దేవుడమ్మ అవును అన్నట్టుగా తల ఊపుతుంది. నీ కోరిక నాకు తెలుసు నీ కోరికను నేను తీరుస్తాను అని ఆమె అనడంతో దేవుడమ్మ సంతోషపడుతుంది. మరొకవైపు భాగ్యమ్మ రాధకు పసుపు పూసి అమ్మవారికి బోనం సమర్పించి నీ బిడ్డని, నీ భర్తని ఒకటి చేయమని కోరుకో అని చెబుతుంది.
Devatha July 15 Today Episode : మాధవ ఎత్తులను తిప్పికొట్టిన రాధా.. బోనం ఎత్తి దేవుడమ్మ ఆశీర్వాదం..
అప్పుడు రాధా భాగ్యమ్మ ఇద్దరు కలిసి గుడికి బయలుదేరుతారు. మరొకవైపు గుడిలో దేవుడమ్మకి అమ్మవారు వచ్చిన మహిళ కళ్ళు తెరిచి చూడు నీ ముందరే ఉంది నువ్వు పట్టాలి అని అనగా దేవుడమ్మతోపాటు కుటుంబం మొత్తం ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత రాధ బోనం తీసుకుని గుడిలోకి అడుగుపెడుతుంది. అప్పుడు దేవుడమ్మ అమ్మవారికి బోనం సమర్పించి నా కోడలు నీ తొందరగా చూపించు తల్లి అని వేడుకుంటుంది. ఆ తర్వాత ఆదిత్య జరిగిన విషయాలు తలచుకొని గుడిమెట్ల పై కూర్చుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి దేవి వచ్చి ఆదిత్యతో మాట్లాడుతూ ఉండగా వెనకవైపు నుంచి మాధవ చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు.
మాయ మాటలతో దేవిని దగ్గర చేసుకోవాలని చూస్తున్నావా నీకు ఎలా షాక్ ఇస్తానో చూడు అంటూ మాధవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు భాష,కమల రాధ గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక రాధ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉండగా ఇంతలో దేవుడమ్మ అక్కడికి వచ్చి ఆగు అమ్మాయి అని అరవగా అప్పుడు రాధ తనని తన అత్తమ్మ గుర్తుపట్టేసింది అని టెన్షన్ పడుతూ ఉంటుంది.
అదంతా చూస్తున్న భాగ్యమ్మ కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతలో దేవుడమ్మ రాధ దగ్గరికి వచ్చి అలా బోనం నువ్వు సమర్పించకూడదు ఎవరైనా ముత్తైదువులు సమర్పించాలి అని అనడంతో రాధ కాస్త ఊపిరి పీల్చుకుంటుంది. ఆ తర్వాత దేవుడమ్మ పాదాలకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటుంది. మరొకవైపు చిన్మయి అమ్మవారికి ముక్కుంటూ ఉండగా ఇంతలో మాధవ అక్కడికి వచ్చి కావాలనే సత్యకు వినిపించే విధంగా దేవి గురించి దొంగ ప్రేమను నటిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలోనే సత్య అక్కడికి రావడంతో సత్య తో మాధవ మాట్లాడుతూ ఉండగా అప్పుడు మాధవ మాటలు విని దేవి బాధపడుతూ ఉంటుంది.
Read Also : Devatha july 14 Today Episode : ఆదిత్య మాటలకు షాక్ అయిన మాధవ.. బాధలో రాధ..?