Devatha july 14 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దేవుడమ్మ దేవికి మొదటి బోనం ఎత్తుతుంది. ఈరోజు ఎపిసోడ్ లో రామ్మూర్తి ఇంట్లో బోనాలు సిద్ధం చేస్తారు. ఇంతలోనే రాధ అక్కడికి రావడంతో అప్పుడు మాధవ రాధ వైపు అలా చూస్తూ ఈ చీరలో అందంగా ఉన్నావు అని అనడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత జానకిరాదనం బోనం ఎత్తుకోమని చెప్పగా వెంటనే రాధ తాను గుడికి రావడం లేదు అని చెప్పి ఊర్లో ఎవరైనా అడిగితే ఒంట్లో బాగాలేదని చెప్పమని చెబుతుంది.
ఆ తరువాత ఒకవైపు రామ్మూర్తి కుటుంబం మరొకవైపు దేవుడమ్మ కుటుంబం ఇద్దరూ గుడిలోకి బోనాలను తీసుకొని వస్తారు. ఇంతలోనే అప్పుడు రాధ టాపిక్ రావడంతో అప్పుడు ఆదిత్య తనకు ఏం ప్రాబ్లం ఉందో మళ్లీ మాట్లాడుకుందాం అని చెప్పి అక్కడ నుంచి వారిని గుళ్లోకి పంపిస్తాడు. మరొకవైపు రాధ ఇంట్లో బోనం ముందు కూర్చుని తన మనసులోని బాధలు అమ్మవారికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటుంది.
Devatha july 14 Today Episode : రాధ బోనం తీసుకొని పొలం దగ్గర ఉన్న అమ్మవారికి బోనం సమర్పిస్తూ…
నాకు ఏమి కోరికలు లేవు నా కూతుర్నే తన తండ్రి దగ్గరికి పంపించేలా చెయ్యి తల్లి అని అమ్మవారిని వేడుకుంటుంది రాధ. ఆ బోనం కుండను పొలం దగ్గర ఉన్న అమ్మవారికి సమర్పించాలి అనుకుంటుంది. మరొకవైపు గుడిలో ఆదిత్య రాధ, దేవి ని ఎలా అయినా తన ఇంటికి వచ్చేలా చేయమని చెబుతూ అమ్మవారిని వేడుకుంటూ ఉంటాడు.
ఇంతలోనే మాధవ అక్కడికి వచ్చి నీ కోరికలు తీరవు. నీ కూతురు నీ దగ్గరికి రాదు నా కూతురు అంటూ గట్టిగా చెబుతాడు నా కూతుర్ని తీసుకెళ్లాలని చూస్తే చిన్మయి తట్టుకోలేదు అని అంటూ ఉండగా ఇంతలోనే ఆదిత్య మీ స్వార్థం కోసం నన్ను నా కూతురికీ దూరం చేయకు. ఎలా అయినా నా కూతురు నా సొంతమవుతుంది అది ఈరోజు అయినా కావచ్చు అనడంతో వెంటనే మాధవ షాక్ అవుతాడు.
అలా ఆదిత్య మాటలకు మాధవ ఏమి మాట్లాడకుండా షాక్ లో ఉండిపోతాడు. మరొకవైపు రాధ బోనం తీసుకొని పొలం దగ్గర ఉన్న అమ్మవారి దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తూ ఉండగా ఇంతలోనే భాగ్యమ్మ అక్కడికి వచ్చి రుక్మిణి అని గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత రుక్మిణి దగ్గరికి వచ్చి ఈ బోనం ఎక్కడ సమర్పించాలో అక్కడే సమర్పించాలి అని అంటుంది భాగ్యమ్మ.
కానీ నువ్వేంటి ఇక్కడ బోనం సమర్పిస్తున్నావు అని అడుగుతుంది. ఆ మాటకు వెంటనే రాధా అక్కడికి వెళ్తే అక్కడ అందరూ నన్ను చూస్తారు అని అనగా వెంటనే భాగ్యమ్మ అలా అని ఇక్కడ సమర్పిస్తావా అని అడుగుతుంది. నువ్వు ఎలా అయినా సరే అక్కడికే వెళ్లి బోనం సమర్పించాలి అనడంతో రుక్మిణి ఎలా వెళ్లాలి అని ఆలోచిస్తుంది. ఆ తర్వాత భాగ్యమ్మ నేను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి ముఖానికి అమ్మవారి దగ్గర ఉన్న పసుపును పూస్తుంది. రేపటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.
Read Also : Devatha july 13 Today Episode : దేవికి అసలు విషయం చెప్పడానికి సిద్ధపడిన రాధ.. మరొక ప్లాన్ వేసిన మాధవ..?