Intinti Gruhalakshmi july 19 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్లో దివ్య కి గోల్డ్ చైన్ దొరకడంతో తులసి ఇస్తుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి చైన్ ఇవ్వడానికి బయలుదేరుతాను అని అనగా ఇంట్లో వాళ్ళు వద్దు అని చెప్పినా కూడా తులసి వినిపించుకోకుండా సామ్రాట్ ఇంటికి బయలుదేరుతుంది. మరొకవైపు సామ్రాట్ తులసి విషయంలో మా బాబాయ్ తప్పు చేశాడు అని అనుకుంటూ ఉండగా ఇంతలో తులసి సామ్రాట్ ఇంటికి వస్తుంది
అప్పుడు తులసి సామ్రాట్ కి చైన్ ఇవ్వగా సామ్రాట్ మాత్రం తులసి కచ్చితంగా దొంగతనం చేసింది అన్న విధంగా మాట్లాడడంతో తులసి సామ్రాట్ కి నచ్చితే ప్రయత్నం చేస్తుంది. అయినా కూడా సామ్రాట్ మాత్రం తులసిని మరింత తప్పుగా అపార్థం చేసుకుంటాడు. అప్పుడు తులసి ఒకవేళ నేను డబ్బుకు ఆశపడేదాన్ని అయితే ఇచ్చింది అమ్ముకుంటాను కదా తిరిగి మళ్ళీ నీకు ఎందుకు తెచ్చి ఇస్తాను.
ఈ చైన్ ఎందుకు తెచ్చి ఇచ్చానో తెలుసా ఇది మీ చెల్లి జ్ఞాపకం అన్నారు కాబట్టి తెచ్చి ఇచ్చాను అంటూ ఎమోషనల్ గా డైలాగులు కొట్టి సామ్రాట్ కి తగిన విధంగా బుద్ధి చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడు సామ్రాట్ తులసి వెళ్లిపోయిన తర్వాత బాగా తెలివిగా మాట్లాడుతుంది అని అనుకుంటాడు. ఆ తర్వాత హనీ పడుకోకుండా బొమ్మలు గీస్తూ ఉండగా ఇంతలో అక్కడికి సామ్రాట్ వచ్చి నీకు ఏమన్నా అయితే నేను తట్టుకోలేను ఇకపై ఆ తులసిక దూరంగా ఉండు అని చెప్పడంతో హనీ ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది.
ఆ తర్వాత తులసి సంజన ఇంటికి వెళుతుంది. అప్పుడు మ్యూజిక్ క్లాస్ పెట్టడానికి రూమ్ రెంట్ కావాలి అని అనడంతో తులసిని ఒక స్కూల్ దగ్గరికి పిలుచుకోని వెళ్తుంది సంజన. మరొకవైపు ప్రేమ్ ఓనర్ ప్రేమ్ ఫోటో నీ పేపర్ లో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. శృతి ప్రేమ్ భార్య అని తెలుసుకుని శృతిని వెటకారంగా మాట్లాడిస్తూ ఉండగా అప్పుడు శృతి అసలు విషయం చెప్పి ఓనర్ తో మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి వచ్చిన ప్రేమ్ శృతి మాటలు వింటాడు.
అసలు విషయం తెలియడంతో ప్రేమ్ బాధతో కుమిలిపోతూ ఉంటాడు. కానీ ప్రేమ్ వాళ్ళ ఓనర్ మాత్రం చేతకాని వాడుకుని వదిలేసేవాడు అంటూ శృతి ముందు దారుణంగా అవమానిస్తాడు. అప్పుడు శృతిని మాట్లాడకు అంటూ గట్టిగా అరుస్తాడు ప్రేమ్. ఆ తర్వాత ఓనర్ మాటలకు ఎమోషనల్ అయినా ప్రేమ్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. మరొకవైపు తులసి సంజనా కలసి ఒక స్కూల్ దగ్గరికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు.
ఆ తర్వాత సామ్రాట్ హనీకి పనివాళ్ళు ఎవరూ భోజనం క్యారీ తీసుకెళ్లలేదు అని వాళ్ళ పై సీరియస్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత స్కూల్లో హనీ తులసిని చూసి తులసి ఆంటీ అని పిలిచి తులసి దగ్గరకు వెళ్లాలి అని అనుకుంటుంది. అప్పుడు తులసి వాళ్ళు మేడం తో మాట్లాడుతూ ఉండగా అనుకోకుండా పవర్ కట్ అయ్యి హనీ లిఫ్ట్ ఇరుక్కుపోతుంది. ఇంతలోనే సామ్రాట్ స్కూల్ కి వస్తాడు. ఇక రేపటి ఎపిసోడ్లో సామ్రాట్ తులసి పై ఒక రేంజ్ లో కోప్పడుతూ నా బిడ్డను వదిలేయ్ అని దండం పెడతాడు.
Tufan9 Telugu News And Updates Breaking News All over World