Intinti Gruhalakshmi july 18 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో తులసి బయటకు వెళ్లడానికి సిద్ధపడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో తులసి, అత్తయ్య నేను వెళ్ళొస్తాను అని అనడంతో అనసూయ ఎక్కడికి అని అడగగా డాన్స్ స్కూల్ కోసం రూమ్ రెంటుకు ఇస్తానన్నారు అని అనగా వెంటనే పరంధామయ్య ఒకసారి కాల్ చేసి వెళ్ళు అని అనగా తులసి కాల్ చేయడంతో ఆమె వద్దు అని చెబుతుంది. ఆ తర్వాత తులసి బాధపడుతూ ఉండగా అప్పుడు అనసూయ ఇదంతా కూడా ఆ మహాతల్లి వల్లే అని హని ని తిడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి హనీ వస్తుంది.
అప్పుడు ఎందుకు వచ్చావు అమ్మ అని తులసి అడగగా జరిగిన విషయం గురించి సారీ చెబుదామని వచ్చాను ఆంటీ అని అనగా సరే అని అనడంతో ఇంట్లో చెప్పి వచ్చావా అని తులసి అడగగా తాతయ్యకు చెప్పి వచ్చాను ఆంటీ అని చెప్పి తులసికి ముద్దు పెట్టి ఎక్కడి నుంచి వెళ్ళిపోతూ గులాబీ పువ్వు తీసుకొని వెళ్తూ ఉండగా అక్కడ గోల్డ్ చైన్ పడిపోతుంది. మరొకవైపు సామ్రాట్న బాబాయ్ కి ఫోన్ చేసి తులసి విషయంలో ఎందుకు అలా చేశారు అని అడుగుతూ ఉంటాడు.
Intinti Gruhalakshmi july 18 Today Episode : సంతోషంలో నందు,లాస్య…
ఇంతలో హనీ రావడంతో కూతురితో కలిసి సరదాగా మాట్లాడుకుంటూ మెడలో గోల్డ్ చైన్ కనిపించకపోతే ఎందుకు ఎలా పోగొట్టుకున్నావు అని ఆరా తీస్తూ ఉంటాడు. అప్పుడు చేను గురించి టెన్షన్ పడుతూ అడగగా నేను తులసి ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్లాను అని అనడంతో సామ్రాట్ తులసిపై అనుమానంతో తులసి ఇంటికి బయలుదేరుతాడు.
Read Also : Intinti Gruhalakshmi: జైల్లో తులసి,అనసూయ దంపతులు.. నందుపై సామ్రాట్ కి అనుమానం..?
Tufan9 Telugu News And Updates Breaking News All over World