Nitya menon: సౌత్ యాక్టరస్ నిత్యా మీనన్ తన పెళ్లిపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టారు. త్వరలో పెళ్లి ేచుసుకోబోతుందంటూ వచ్చే వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పారు. మలయాల నటుడిని ఆమె పెళ్లి చేసుకోబోతున్నారంటూ వస్తున్న పుకార్లు పచ్చి అబద్ధం అని.. తాను ఇప్పుడే వివాహం చేసుకోనంటూ వివరించింది. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. నా పెళ్లి పేరుతో సంతోషకరమైన కథ అల్లారని నవ్వుతూనే పుకార్లకు తెర దించారు నిత్యా మీనన్. అదృష్ట వశాత్తు తనకు వెంట వెంటనే ఆఫర్లు వస్తున్నందున ప్రస్తుతం ఐదు ప్రాజెక్టుల్లో బిజీగా ఉన్నానని అందుకే కొన్నిరోజులుగా వర్క్ చేస్తూ వచ్చినట్లు తెలిపారు.
ఇప్పుడే కాస్త రిలాక్స్ అవుతున్నానని నిత్యా మీనన్ చెప్పారు. ఒప్పుకున్న అన్ని సినిమాలు పూర్తి చేసిన తర్వాత తన వెకేషన్ ని స్టార్ట్ చేస్తానంటూ ముసి ముసిగా నవ్వారు. కర్ణాటక తన పుట్టినిల్లు అయినప్పటికీ.. మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు సినిమాల్లో యాక్ట్ చేసింది. తెలుగులో ఇటీవలే స్కైలాబ్ అనే సినిమాని స్వయంగా నిర్మించి నటించారు. వెండి తెరపైనే కాదు బుల్లి తెరపై కూడా కనిపించి కనువిందు చేశారు.
AdvertisementView this post on Instagram
AdvertisementAdvertisement