Nithya Menon : దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నిత్యామీనన్ తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ పొందింది.ఇకపోతే గత కొంత కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్న ఈమె గత ఏడాది పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో నటించి ప్రేక్షకులను సందడి చేశారు. ఇకపోతే తాజాగా ఈమె మోడ్రన్ లవ్ హైదరాబాద్ అని వెబ్ సిరీస్ లో నటించారు.ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ ద్వారా జూలై 8వ తేదీ నుంచి ప్రసారం కానుంది.ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగింది.
nithya-menon-has-ingury-her-leg-fans-worried-do-you-know-what-happened
ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి నిత్యమీనన్ చేతిలో స్టిక్ పట్టుకొని ఇద్దరు బాడీగార్డ్ సహాయంతో వేదిక పైకి వచ్చారు.ఇలా ఒక్కసారిగా నిత్యామీనన్ ను చూసే సరికి అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.అసలు ఈమెకు ఏం జరిగింది ఇలా నడవలేని స్థితిలోకి వెళ్లడానికి కారణం ఏంటి అంటూ ఆందోళన చెందారు. ఇకపోతే ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా నిత్యామీనన్ మాట్లాడుతూ తాను ఈ వెబ్ సిరీస్ లో ఎల్బో క్రచ్ గా నటించానని అయితే తనకు నిజజీవితంలో కూడా అలాగే జరిగిందని వెల్లడించారు. రెండు రోజుల క్రితం మెట్లు దిగుతుండగా జారి పడటంతో తనని ఎల్బో క్రచ్ ఎంతో ఇబ్బంది పెడుతోందని ఈమె తెలిపారు.
ఈ విధంగా ఈమే మెట్లు జారి కింద పడటంతో పూర్తిగా నడవలేని స్థితిలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఈమె కర్ర చేత పట్టుకొని ఇద్దరు సహాయంతో నడుస్తూ కనిపించేసరికి ఏం జరిగిందని అభిమానులు ఆందోళన చెందారు. ఇకపోతే సుహాసిని ,రేవతి, రీతు వర్మ,వంటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో చాలా మంది తమకు ఏం జరిగిందో అని ఆందోళన చెందగా అసలు విషయం తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఇలా ఎల్బో క్రచ్ తోఇబ్బంది పడుతున్నప్పటికీ ఈమె ఈవెంట్ కి రావడంతోనే సినిమాల పట్ల ఈమెకు ఉన్న డెడికేషన్ ఏంటో అర్థం అవుతుంది అంటూ మరికొందరు తనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Read Also : Nithya Menen Comments : త్రివిక్రమ్ పై అలాంటి వ్యాఖ్యలు చేసిన నిత్యామీనన్.. ఎప్పుడు అలా చూస్తారంటూ..!