Nagababu : బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో నాగబాబు సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా విపరీతమైన క్రేజీ సంపాదించుకున్నారు.ఇలా ఈ కార్యక్రమంలో పాటిస్పేట్ చేసే కమెడియన్స్ అందరికీ ఆయన పెద్ద దిక్కుగా ఉంటూ అందరికీ సలహాలు సూచనలు ఇవ్వడంతో ఈయనపై కమెడియన్ల అందరికీ విపరీతమైన గౌరవం, విధేయత ఏర్పడింది. అయితే కొంతకాలానికి నాగబాబు జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి రావడంతో ఆయనతో పాటు కొంతమంది కమెడియన్స్ బయటకు వచ్చారు. అలాంటి వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు.
ఈయన జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు ప్రస్తుతం స్టార్ మా లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా నాగబాబు తన ప్రేమ గురించి ఒక పర్ఫామెన్స్ చేశారు.ఇందులో తాను తనకు కాబోయే అమ్మాయితో ఎలా పరిచయమైంది తన ప్రేమను ఎలా దక్కించుకున్నారు అనే విషయాన్ని తెలియజేస్తూ అందరి చేత కంటతడి పెట్టించారు.ఈ డాన్స్ పర్ఫామెన్స్ అయిపోయిన తర్వాత సుధీర్ వేదిక పైకి వచ్చి ఈయన ఎంతగా ప్రేమిస్తాడో మనకు తెలిసిందే అందుకే ఇతనికి కిరాక్ ఆర్పీ అని పేరు పెట్టాము అని తెలిపారు.
ఇక ఆర్పీ ప్రేమించడం మొదలు పెట్టాడు అంటే ఆ ప్రేమ కూడా అదే రేంజ్ లో ఉంటుంది.ఎంతగా అంటే ఏకంగా నాగబాబు గారి పేరును గుండెల పైన పచ్చబొట్టు వేయించుకునే అంతగా ఆయనని ప్రేమిస్తున్నాడని చెప్పాడు. ఇలా తన పేరును గుండెల పై వేయించుకున్నారని తెలియగానే ఒక్కసారిగా నాగబాబు షాక్ అయ్యరు. ఈ క్రమంలోనే నాగబాబు స్పందిస్తూ ఎప్పుడూ చెప్పలేదు ఏంట్రా అని ప్రశ్నించారు. ఆర్పీ నాగబాబుకు తెలియకుండా ఏ పని చేయరు అందుకే తాను మొదటిసారిగా చేయబోతున్న సినిమాకి కూడా ఆయనను ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇక
ఆర్పీ నిశ్చితార్థానికి కూడా నాగబాబు నిహారిక హాజరైన సంగతి మనకు తెలిసిందే.
Read Also : Kiraak RP: కిరాక్ ఆర్పీ లవ్ స్టోరీ తెలుసా.. సినిమా లెవెల్ లో ఉందిగా!