Janaki Kalaganaledu june 30 Today Episode : తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జానకి కలగనలేదు సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. రామచంద్ర, జానకి ఇద్దరు రొమాంటిక్ గా మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈరోజు ఎపిసోడ్ లో జానకి,రామచంద్ర తో మాట్లాడుతూ ముందు మనం అత్తయ్య గారికి ఇచ్చిన మాట ప్రకారం పనిని మొదలు పెడదాం అని అనగా వెంటనే రామచంద్ర ఏం పని అని అడగడంతో అదే పిల్లల విషయం అని జానకి కాస్త సిగ్గుతో చెప్పగా ఆ మాటకు రామచంద్ర సిగ్గు పడుతూ ఉంటాడు.
ఆ తర్వాత రామచంద్రకు దగ్గరగా రావడంతో టెన్షన్ పడిపోయిన రామచంద్ర మీరు ఏదో రాసుకోవాలి అన్నారు కదా అది రాసుకోండి తర్వాత చూద్దామని సిగ్గుపడుతూ అక్కడ నుంచి వెళ్లిపోవడంతో జానకి నవ్వుతూ ఉంటుంది. మరొకవైపు గోవిందరాజులు కుటుంబం అందరూ లడ్డూలు చేయడానికి హడావుడిగా చేస్తూ ఉంటారు.
జానకి కష్టపడుతూ ఉండగా మల్లికా చూస్తూ ఉండడంతో ఇంతలో అక్కడికి వచ్చిన గోవిందరాజులు, మల్లిక పై సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత జ్ఞానాంబ అక్కడికి వచ్చి మల్లికను అరవడంతో మల్లిక పని మొదలు పెడుతుంది. ఇంతలోనే విష్ణు వచ్చి మల్లికతో వెటకారంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడు మల్లికా కాస్త ఓవర్ గా మాట్లాడుతుంది.
వెంటనే గోవిందరాజులు మల్లికా పై సెటైర్యంతో అందరూ నవ్వుతూ ఉంటారు. ఆ తర్వాత అందరూ లడ్డూలు చేసే పనిలో బిజీబిజీగా ఉంటారు. అప్పుడు జానకి, మల్లిక లడ్డూలు బాగా చేస్తుంది అంట కదా తనతో చేయించండి అని బుక్ చేస్తుంది.. ఆ తర్వాత రామచంద్ర ఎలా అయినా జానకి రాసుకునే విధంగా చేయాలి అని లడ్డూలను గదిలోకి తీసుకుని వెళ్లి జానకి రాసుకునే విధంగా చేస్తాను అని అనుకుంటూ ఉంటాడు.
అనుకున్న విధంగా జానకిని లోపలికి తీసుకుని వెళ్తాడు. కానీ జానకి మాత్రం రాసుకోకుండా రామచంద్ర తో కలిసి లడ్డూలు చేస్తుంది. ఎంత చెప్పినా కూడా వినిపించుకోదు. అలా వారిద్దరూ అందరికంటే ముందుగా వారు లడ్డూలు చేసి తీసుకుని రావడంతో జ్ఞానంబ దంపతులు వారిపై పొగడ్తల వర్షం కురిపిస్తారు.
అది చూసి మల్లికా కుళ్ళు కుంటూ ఉంటుంది. అప్పుడు జ్ఞానాంబ, మల్లిక ను జానకిని చూసి నేర్చుకోమని అనడంతో అప్పుడు మల్లిక అలాగే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. అప్పుడు మల్లికా ఎలా అయినా ఏదో ఒకటి చేసి జానకిని తిట్టించాలి అని కుట్ర పన్నుతుంది.
Janaki Kalaganaledu june 27 Today Episode : జానకిపై పొగడ్తలు వర్షం కురిపించిన జ్ఞానాంబ దంపతులు..మల్లిక పై సీరియస్ అయిన జ్ఞానాంబ..?
Read Also : Used cooking oil: వంటనూనె రెండో సారి వాడుతున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి!