Uday Kiran : ఒకప్పటి స్టార్ హీరో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు తేజ దర్శక్వంలో తెరకెక్కిన “చిత్రం” సినిమా ద్వారా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఈ సినిమా సూపర్ హిట్ అవటంతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత నువ్వు నేను, మనసంతా నువ్వే సినిమాలు కూడా వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో హ్యాట్రిక్ హీరోగా ఉదయ్ కిరణ్ ఇమేజ్ మరింత పెరిగింది. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఉదయ్ కిరణ్ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. నువ్వు నేను సినిమాకి గాను ఉత్తమ కథా నాయకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా పొందాడు.
అంతేకాకుండా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన పెద్ద కూతురు సుస్మిత ఉదయ్ కిరణ్ వివాహం చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ వివాహం రద్దు అయ్యింది. అప్పటి నుంచి ఉదయ్ కిరణ్ కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఆ సమయంలో ఉదయ్ కిరణ్ నటించిన కొన్ని సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అయితే ఆ సినిమాలు ఆగిపోవడానికి కారణం చిరంజీవి కూతురుతో ఉదయ్ కిరణ్ పెళ్లి రద్దు కావడమే అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ఇలా ఉదయ్ కిరణ్ నటించిన అరడజను సినిమాలు విడుదల కాకుండా ఆగిపోయాయి. అవేంటో తెలుసుకందాం.
సినిమాలు ఫ్లాప్ అవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న ఉదయ్ కిరణ్..
తెలుగులో ఉదయ్ కిరణ్ సినీ జీవితం కొంచం స్లో అవటంతో తమిళ భాషలో కూడా “పోయ్” అనే సినిమాలో నటించాడు. ఈ సినిమా “అబద్దం ” అనే పేరుతో తెలుగులో కూడా రీమేక్ చేశారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. అంతే కాకుండా బాలకృష స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ” నర్తనశాల ” అనే సినిమాలో కూడా అభిమన్యు పాత్రలో నటించాడు. కానీ సౌందర్య చనిపోవడంతో ఆ సినిమా ఆగిపోయింది. ఉదయ్ కిరణ్, త్రిష జంటగా ఒక హింది రీమేక్ సినిమాలో నటించాల్సి ఉంది. కానీ ఆ సినిమా కూడా ఆగిపోయింది. ఇలా ఉదయ్ కిరణ్ నటించాల్సిన ఇంకో మూడు సినిమాలు కూడా ఆగిపోయాయి.
Read Also : Uday Kiran : నటుడు ఉదయ్ కిరణ్ డెత్ సీక్రెట్ ఏంటి.. ఆయన మరణం వెనుక ఏం జరిగిందంటే?