Fack check: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల దగ్గర నుండి పండు ముసలి వాళ్ల వరకు అందరి దగ్గరా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అలాగే ప్రతీ ఒక్కరు సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే నెట్టి ఫేక్ న్యూస్ బాగా వైరల్ వఅవుతోంది. నిజం గడపదాటే లోపే అబద్ధం ఊరంతా తిరిగొస్తుందన్న సామేత ఉత్తిగానే రాలేదు కదా. ఇప్పుడు కొన్ని వార్తలు కూడా అలానే సర్కులేట్ అవుతున్నాయి. తాజాగా షేక్ పేట ఫ్లై ఓవర్ పైనుంచి వహనాలు జారి కింద పడుతున్నాయని చాలా మంది అంటున్నారు. అందులో వాస్తవం ఉందో లేదో తెలియకుండానే రూమర్స్ ను విపరీతంగా స్పెండ్ చేసేస్తున్నారు. అయితే అసలు విషయానికి వస్తే.. షేక్ పేట ఫ్లై ఓవర్ అంటూ చిపిస్తున్న ఈ వీడియో పాకిస్తాన్ కి చెందింది. ఇటీవల కరాచీలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాం ుకరవడంతో… చాలా మంది వాహన దారులు కింద పడిపోయారు.
అక్కడి మిలీనియం మాల్ సమీపంలోని రషీద్ మిన్సాస్ రోడ్ లోని ఫ్లై ఓవర్ పై వాహనదారులు పడిపోతున్న ఈ వీడియో కెమెరా కంటికి చిక్కింది. ఇక ఈ ఘటన మన హైదరాబాద్ లోనే జరిగిందంటూ పలువులు న్యూస్ ను స్ప్పెడ్ చేశారు. షేక్ పేట ఫ్లైఓవర్ పైనే ఇది జరిగిందంటూ వార్తలు రావడంతో చాలా మంది నిజమే అనుకున్నారు. కానీ ఇదంతా అబద్ధం.