Kalyan Ram : నందమూరి కల్యాణ్ రామ్ ఫ్యామిలీని ఎప్పుడైనా చూశారా? ఎప్పుడు నందమూరి ఫ్యామిలీలో కల్యాణ్ రామ్ తప్ప ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి ఫొటోలను ఎప్పుడు షేర్ చేయలేదు. అయితే కల్యాణ్ రామ్ ఫ్యామిలీకి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లక్ష్మీ కళ్యాణం మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే అభిమానులను సంపాదించుకున్నారు.

నందమూరి హరికృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తనకుంటూ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. కల్యాణ్ రామ్ నటించిన చాలా సినిమాల్లో అభిమన్యు, అతనొక్కడే, పటాస్ వంటి హిట్ చిత్రాల్లో సూపర్ హిట్ సాధించాయి. ప్రస్తుతం బింబిసార మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రియాడికల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి డైరెక్టర్ వశిష్ట్ దర్శకత్వాన్ని అందిస్తున్నారు. సొంత ప్రొడక్షన్ హౌస్‌లోనే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

లేటెస్టుగా కల్యాణ్ రామ్ ఫ్యామిలీ పిక్ వైరల్ అవుతోంది. కల్యాణ్ రామ్.. ఆయన సతీమణి స్వాతి, కుమార్తె తారక అద్వైత, కుమారుడు సౌర్య రామ్ ఉన్నారు. ఇప్పటివరకూ కళ్యాణ్ రామ్ ఎప్పుడూ కూడా తన వ్యక్తిగత విషయాలైన, ఫ్యామిలీ విషయాలను షేర్ చేయలేదు. అలాంటిది ఇప్పుడు కల్యాణ్ రామ్ ఫ్యామిలీ పిక్ ఒకటి బయటకు వచ్చింది. ఆ ఫొటోలో కల్యాణ్ రామ్ తన ఫ్యామిలీతో దిగిన ఫొటో చాలా క్యూట్‌గా ఉంది. ఈ ఫొటోను చూసిన నందమూరి అభిమానులు.. క్యూట్ ఫ్యామిలీ అంటూ పోస్టులు పెడుతున్నారు.
Read Also : Naga Chaitanya : హీరోయిన్ ముందే నాగచైతన్య బోల్డ్ కామెంట్స్..ఆ టైంలో బట్టలుండవు , నిద్రపోనివ్వరు అంటూ!