Bimbisara Pre Release Event : నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం బింబిసార. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా కేథరిన్, సంయుక్త మీనన్ నటించారు. ఈ మూవీ ఆగస్టు 5న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమాకు వశిష్ఠ దర్శకత్వం వహించాడు.
ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది. బింబిసార టీజర్ ట్రైలర్, పాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రిలీజ్ ట్రైలర్ నందమూరి అభిమానుల్లో మంచి జోష్ నింపింది. ఈ మూవీ ట్రైలర్ చూసిన అభిమానుల అంచనాలు ఎక్కువ అయ్యాయి. ఈ సినిమా ట్రైలర్‌ను కళ్యాణ్ రామ్ సోదరుడు ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేయడంతో మరింత హైప్ క్రియేట్ చేసింది.
Bimbisara Pre Release Event : బింబిసార ప్రీ-రిలీజ్ ఈవెంట్.. రిలీజ్ ట్రైలర్ విడుదల..
త్రిగర్తల సామ్రాజ్యనేత బింబిసారుడుతో పాటు కళ్యాణ పోషించిన మరో పాత్రను చూడొచ్చు. యుద్ధ విన్యాసాలు, పవర్ ఫుల్ డైలాగ్స్, మంచి విజువల్స్ తో ఈ ప్రచార చిత్రం ఆసక్తిగా సాగింది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ .కె నిర్మిస్తున్న ఫాంటసీ యాక్షన్ చిత్రం కి ఎం. ఎం. కీరవాణి గారు సంగీతం అందించారు. ఇక ఈరోజు సాయంత్రం హైదరాబాదు లో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహిస్తోంది. దీనికి ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ రావడంతో నందమూరి అభిమానులతో సందడిగా మారింది.
Read Also : Rashmi Gautam : యాంకర్ రష్మి గౌతమ్ ఒక్కో షోకు రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. నోరెళ్లబెట్టాల్సిందే!