Uday Kiran Vs Junior NTR : సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే వంటి చిత్రాలతో అతను స్టార్ హీరో అయ్యాడు. అలాగే.. బాల్య నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమై హీరోగా నిన్ను చూడాలని చిత్రంతో ఎంట్రీ ఇచ్చి ఎన్టీఆర్ స్టూడెంట్ నెంబర్ 1, ఆది చిత్రాలతో స్టార్ హీరోగా అయ్యాడు. నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ లేకుండానే నందమూరి అభిమానులకు ఎంతో దగ్గరయ్యాడు. ఎన్టీఆర్ కంటే ఉదయ్ కిరణ్ ముందుగానే స్టార్ అయ్యాడు. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్ ఒకే టైంలో ఇండస్ట్రీలో వచ్చారు. ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా చాలా కీర్తిని సంపాదించాడు.
ఈ ఇద్దరి సినిమాలు వస్తున్నాయంటే స్టార్ హీరోలైన బాలకృష్ణ ,చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ వంటి హీరోలు సినిమాలను కూడా పోస్ట్ ఫోన్ చేసే పరిస్థితి నెలకొన్నది. ఇద్దరి హవా కొన్నాళ్లు ఇండస్ట్రీలో నడిచింది. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొంతకాలం తర్వాత ఆ ఇద్దరి హవా తగ్గింది. ఉదయ్ కిరణ్ సినిమాలు పెద్దగా రాలేదు. తన కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. ఎన్టీఆర్ సింహాద్రి సినిమాతో తనకున్న పేరును కాపాడుకుంటూ వచ్చాడు. ఈ ఇద్దరు హీరోలు ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసారు.
Uday Kiran Vs Junior NTR : ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ ఒకేసారి రిలీజ్ అయిన సినిమాలు ఇవే..
మూడు సార్లు ఇద్దరి సినిమాలు ఒకేసారి విడుదలయ్యాయి. ఎన్టీఆర్ ఉదయ్ కిరణ్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు సార్లు పోటీ పడ్డారు. 2006 డిసెంబర్ 22న రాఖీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరుసటి రోజు డిసెంబర్ 23 న అబద్ధం ఉదయ్ కిరణ్ సినిమా విడుదల అయ్యింది. ఈ చిత్రానికి డైరెక్టర్ కె బాలచందర్ రావు చేశారు. ఈ సినిమా ప్లాప్ అయింది. 2012 న నువ్వెక్కడుంటే నేనక్కడుంటా సినిమా ఏప్రిల్20 న రిలీజ్ అయింది. ఆ సినిమా వారం తర్వాత ఏప్రిల్27 జూనియర్ ఎన్టీఆర్ దమ్ము సినిమా విడుదలైంది.
ఈ సినిమా డైరెక్టర్ బోయపాటి శీను చేశారు. దమ్ము సినిమా యావరేజ్ గా ఉంది. ఎన్టీఆర్ 2013 లో… ఏప్రిల్5 న బాదుషా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉదయ్ కిరణ్ సినిమా ఏప్రిల్11 న జై శ్రీరామ్ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ఉదయ్ కిరణ్, ఎన్టీఆర్ సినిమాలు ఆశించిన స్థాయిలో అభిమానుల ఆదరణ పొందలేదు. ఇద్దరి సినిమాలు యావరేజ్ టాక్ తో నడిచాయి.
Read Also : Uday Kiran : నటుడు ఉదయ్ కిరణ్ డెత్ సీక్రెట్ ఏంటి.. ఆయన మరణం వెనుక ఏం జరిగిందంటే?