Bigg Boss 6 telugu 6 : బిగ్ బాస్ 6 కోసం అన్ని సిద్ధం చేస్తున్నారు ఇక బిగ్ బాస్ 6 ప్రారంభం కాబోతుంది. దీనికి మళ్లీ హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ఈసారి గ్రాండ్ ప్లాన్ చేయాలనేది నిర్వాహకుల ఆలోచన దీనికోసం అనేక మంది సెలబ్రిటీలను ,యాంకర్స్ ని అప్రోచ్ అవుతున్నారు. వారితో అనేక సంప్రదింపులు జరుపుతున్నారట. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్ గా నిలిచిన ఉదయభాను పేరు గట్టిగానే వినిపిస్తోంది. ఆమెతో బిగ్ బాస్ నిర్వాహకులు అనేక సంప్రదింపులు జరిపారని ఆమె లోకి రావడం గ్యారంటీ అని చెబుతున్నారు.
గతంలోనే ఉదయభాను బిగ్ బాస్ లోకి రావాల్సిందట అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె రాలేకపోయిందట ఇక ఈసారి ఎలాగైనా ఆమెను రంగంలోకి దించాలని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తే ఉదయభాను బిగ్ బాస్ షో కి రావడం ఖాయం. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈమె బిగ్ బాస్ షో లో ఉండడం వల్ల ఈ షో కి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి.
టిఆర్పి రేటింగ్ విపరీతంగా పెరిగిపోతుందనే అంచనాలు వెళ్ళువిరుస్తున్నాయి. ఇకపోతే ఉదయభాను బుల్లితెరపై టాప్ యాంకర్ గా నిలిచి వెండితెరపై కూడా ఒక వెలుగు వెలిగింది. ఈమె ఐటమ్ సాంగ్స్ కి కూడా డాన్స్ వేసింది. జులాయి, లీడర్ వంటి సినిమాలలో ఐటమ్ సాంగ్ చేసి తన అభినయంతో అందరిని మెప్పించింది. ఇక ఆమెకు కవల పిల్లలు పుట్టిన తర్వాత స్క్రీన్ మీద ఎక్కువగా కనిపించలేదు.
చాలా గ్యాప్ తర్వాత షో లకి ఎంట్రీ ఇస్తూ తన కెరీర్ ని మళ్లీ మొదలు పెట్టింది. ఇక ఈ షో కోసం ఉదయభాను భారీ రెమ్యునరేషన్ కోరుకుంటుందని వాదోపవాదనలు వినిపిస్తున్నాయి. ఇక బిగ్ బాస్ నిర్వాహకులు భారీ పారితోషికం ఇచ్చి ఆమెను ఎలాగైనా షో కి తీసుకురావాలని సన్నద్దాలు చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే ఉదయభాను క ఉదయభాను కెరీర్ మరలా ఒక మలుపు తిరుగుతుందనే చెప్పాలి.