Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ 6 అట్టహాసంగా ప్రారంభం అయింది. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రియాల్టీ షో మళ్లీ రానే వచ్చింది. బిగ్ బాస్ అభిమానులు ఈ సారి ఈ రియాలిటీ షోపై భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్లుగానే బిగ్ బాస్ ప్రోగ్రాం తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది. ఎప్పుడూ లేనంతగా ఈసారి 20 మంది కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగు పెట్టారు. ఈ సారి గ్లామర్ ఎక్కువగా ఉండేలా చూసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ క్యూట్ కపుల్ ను కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి పంపించారు. వారి పేరే మెరీనా, రోహిత్.

Bigg Boss 6 Telugu couple rohit and marina starts fighting
Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్‌లో మెగుడు పెళ్లాల కొట్లాట…
అంతకుముందు బిగ్ బాస్ సీజన్ 3 లో వరుణ్ సందేశ్, వితికలు భార్యా భర్తలుగా హౌజ్ లోకి వచ్చారు. వాళ్లు మొదట్లో చాలా అన్యోన్యంగా ఉన్నారు. తర్వాత్తర్వాత వారి మధ్య గొడవలు జరిగాయి. అదే ఇప్పుడు తాజాగా హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెరీనా, రోహిత్ లు మాత్రం హౌజ్ లోకి వచ్చిన మొదటి నుండే గొడవలు పెట్టుకుంటున్నారు. క్యూట్ కపుల్ గా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అచ్చంగా భార్య భర్తలు ఎలా ఉండాలో అలాగే గొడవలు పడుతూ అరుచుకుంటూ హౌజ్ లో రచ్చ చేస్తున్నారు.
వాష్ రూమ్ దగ్గర రోహిత్ కు ఏదో చెప్పబోయింది మెరీనా. కానీ మెరీనా చెప్పేది రోహిత్ పట్టించుకోలేదు. తన బాడీ చూసుకుంటూ ఉండిపోయాడు. దీంతో మెరీనాకు చిర్రెత్తుకొచ్చింది. నువ్వు నీ బాడీ చూసుకో అంటూ కోపంగా వెళ్లిపోయేందుకు సిద్దమైంది. అప్పుడు రోహిత్ మెరీనాను ఓవరాక్షన్ చేయకు అంటూ తనను ఆపే ప్రయత్నం చేసి.. తర్వాత నువ్వెప్పుడు ఇలాగే అంటూ తన పనిలో మునిగిపోయాడు.
Read Also : Arjun Kalyan : ఆ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపిన బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ అర్జున్ కళ్యాణ్… ఆమె ఎవరంటే?