Nagarjuna : శర్వానందర్, రీతూ వర్మ హీరోహీరోయిన్లుగా నటించిన ఒకే ఒక జీవితం సినిమా గురించి మనందరికీ తెలిసిందే. అయితే శ్రీకార్తిక్ దర్శకుడిగా పరిచయం అవుతూ.. అక్కినేని అమల, వెన్నెల కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఈనెల 9వ తేదీన విడుదల కాబోతుంది. ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎశ్ఆర్ ప్రభు నిర్మించిన సినిమా మంగళ వారం రాత్రి హైదరాబాద్ లోని ఏఎంబీ సినిమాస్ లో సెలబ్రిటీ ప్రీమియర్ షో వేసింది. ఈ షోకి అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మెండేటి, మేర్లపాక, గాంధీ, వశిష్ట్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరిలు హాజరయ్యారు.

అయితే సినిమా చూసి బయటకు వచ్చిన నాగార్జును, అఖిల్ లు ఎమోషనల్ అయ్యారు. ముఖ్యంగా తల్లీకొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్్ నాగ్ ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథని తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్ కంగ్రాట్స్ చెప్పారు. సినిమా చాలా బాగుందంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఒకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని అప్పటి వరకు వచ్చిన టైమ్ ట్రావెల్ చిత్రాలకు చాలా భిన్నంగా ఉంటుందని దర్శకులు చెబుతున్నరు. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెక్ ని సాధిస్తుందో తెలియాలంటే ఇంకో రెండు మూడు రోజులు ఆగాల్సిందే.