Nagababu Warning : మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజుకు సంబంధించి హైదరాబాద్ హైటెక్స్ లో గ్రాండ్ గా ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్య్కక్రమంలో మెగా హీరోలతో పాటు అభిమానులు కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ క్రమంలోనే మెగా బ్రదర్ నాగబాబు పలు ఆసక్తికర కామెంట్లు చేసారు. కాస్త ఎమోషనల్ అయి పలువురికి వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఈ విషయం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
తన సోదరులు చిరంజీవి, పవన్ కల్యాణ్ ను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదని, తాటా తీస్తానంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు నాగబాబు. మెగా ఫ్యామిలీలో ఉన్న చాలా మందికి చిరంజీవి లైఫ్ ఇచ్చాడని అలాంటి వాడిని ఎవరైనా ఏమైనా అంటే తామెవరూ చూస్తూ ఊరుకోమన్నారు. బన్నీ, చరణ్, వరుణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్, నిహారిక, సిరీశ్ వీరందరికి బంగారు భవిష్యత్తు ఇచ్చింది చిరంజీవే అంటే నాగబాబు ఎమోషనల్ అయ్యారు.
తన సోదరులను ఏమైనా అంటే ఊరుకోకుండా కౌంటర్ లు ఇవ్వడం వల్లే తనను కాంట్రవర్సియల్ పర్సన్ అంటారని తెలిపారు. తన కుటుంబం అంటే తనకు మొదటి నుంచి ప్రేమ ఎక్కవని.. వాళ్లలో ఎవర్ని ఏమన్నా తాను తట్టుకోలేనని వివరించారు.
Read Also : Chiranjeevi Birthday : చిరంజీవి.. మెగాస్టార్ అంత ఈజీగా కాలేదు..!