Karthika Deepam serial Oct 6 Today Episode : తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో దీప వాళ్ళు మోనిత ఇంటికీ వచ్చి హడావిడి చేస్తూ ఉండటంతో మోనిత కోప్పడుతూ ఉంటుంది. ఈరోజు ఎపిసోడ్ లో మోనిత కోపడుతూ ఉండగా కార్తీక్ ఎందుకు అలా అరుస్తున్నాము మోనిత అని అంటాడు. అప్పుడు కార్తీక్ ఏం పండగ దీప అని అనగా మీ పండగే డాక్టర్ బాబు ఈరోజు మీ పుట్టినరోజు పండగ అనడంతో మోనిత షాక్ అవుతుంది. అప్పుడు దీప కార్తీక్ కి ఫ్లవర్స్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మోనిత ని అడ్డంగా ఇరికిస్తూ ఉంటుంది. దాంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.

అప్పుడు కార్తీక్, మోనిత నా బర్త్ డే నీకెందుకు గుర్తులేదు చెప్పు అని అనగా చేద్దాం అనుకున్నాను కార్తీక్ సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాను కానీ మర్చిపోయాను అని అంటుంది. ఇప్పుడు దీప డాక్టర్ బాబుని మరింత రెచ్చగొట్టడానికి డాక్టరమ్మ ఈ పాటికి ఇల్లంతా బెలూన్లు లైట్ డెకరేషన్ తో హడావిడి చేస్తూ ఉంటుంది అనుకున్నాను అనడంతో మోనిత దీప వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత నేను నీకోసం చిన్న సర్ప్రైజ్ చేశాను డాక్టర్ బాబు అని తన ఇంటికి పిలుచుకొని వెళ్తుంది.
అక్కడ లైట్ డెకరేషన్ చూసి కార్తీక్ సంతోష పడుతూ ఉంటాడు. ఆ తర్వాత కార్తీక్ కేక్ కట్ చేయడంతో మోనిత దీప ఇద్దరు కేక్ తినిపిస్తూ ఉండగా. ఇంతలో డాక్టర్ వాళ్ళ అన్నయ్య మోనిత చేతిలో ఉన్న కేక్ కింద పడేలా చేస్తుంది. అప్పుడు కావాలని అందరూ ప్లాన్ చేసుకుని మరి వచ్చారు అని అనుకుంటూ ఉంటుంది మోనిత. అప్పుడు దీప చిన్న సర్ప్రైజ్ అంటూ గతంలో కార్తీక్ కి గిఫ్ట్ గా ఇచ్చిన పరిస్థితి ఇవ్వడంతో మోనిత షాక్ అవుతుంది. అంటే గతంలో కూడా నువ్వు నా బర్త్ డే సెలబ్రేట్ చేయలేదా మోనిత అని అడగగా మోనిత టెన్షన్ పడుతూ కార్తీక్ నీ అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది.
కార్తీక దీపం సీరియల్ అక్టోబర్ 6 ఎపిసోడ్ : మోనితకు షాక్ మీద షాక్.. కార్తీక్, వంటలక్క ఫుల్ ఖుషీ..
ఇక మరుసటి రోజు ఉదయం దీప డాక్టర్ బాబు ని గుడికి తీసుకొని వెళ్లడానికి ఇంటికి వెళ్ళగా ఇంటికి తాళం వేసి ఉంటుంది. ఎక్కడికి తీసుకొని వెళ్లి ఉంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు దుర్గకి ఫోన్ చేయడంతో దుర్గ ఫోన్ కలవకపోవడంతో మరింత టెన్షన్ పడుతుంది. ఇంతలో దీప వాళ్ళ అన్నయ్య రావడంతో అతనితో చెప్పి బాధపడుతూ ఉంటుంది. మరొకవైపు కార్తీక్,మోనిత ఇద్దరూ ఎక్కడికో వెళ్తూ ఉంటారు. అప్పుడు మోనిత, కార్తీక్ ని వాళ్లకు దూరంగా ఈ రోజైనా ప్రశాంతంగా ఉండేలా తీసుకుని వెళ్లాలి అనుకుంటూ ఉండగా కార్తీక్ మాత్రం జరిగిన విషయాల గురించి తలుచుకుని ఆలోచిస్తూ ఉంటాడు.
అప్పుడు కార్తీక్,మోనిత నువ్వు నిజంగానే అన్న పుట్టినరోజు మర్చిపోయావా అని అడగగా అవును కార్తీక్ ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఈ పాటీకి 100 సార్లు చెప్పాను ఇంకొకసారి అడగకు దండం పెడతాను అని అంటుంది మోనిత. అప్పుడు ఆ వంటలక్క కు కూడా తెలియదు నేను వంట వాళ్లతో నీ పుట్టినరోజు గురించి మాట్లాడుతుంటే అది తెలుసుకుని నీకు పుట్టినరోజు చేసింది అని మోనిత అనడంతో నీకు పుట్టినరోజు గుర్తులేదు అని చెప్పు నమ్ముతాను కానీ ఇలాంటి కథలు చెప్పొద్దు అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ మధ్యలో దుర్గని ఇన్వాల్వ్ చేస్తూ మాట్లాడడంతో మోనిత టెన్షన్ పడుతూ ఉంటుంది.
వెంటనే మోనిత నాకు వాడికి ఎటువంటి సంబంధం లేదు కార్తీక్ నన్ను నమ్ము అని అంటుంది. కొంపతీసి నువ్వు వాడు ఏమైనా ఆ ప్లాన్ చేశారా ఈ మధ్యకాలంలో ఇలా ప్రియుడు కోసం బర్తడే చంపడానికి కూడా వెనకాడడం లేదు నువ్వు కూడా అలాంటి ప్లాన్ ఏమైనా వేసావా అని అడుగుతాడు కార్తీక్. దాంతో మోనిత ఒక్కసారిగా షాక్ అవుతుంది. చాలు ఆపు కార్తీక్ ఇంకొకసారి అలా మాట్లాడకు నువ్వు నా ప్రాణం కార్తీక్ అని అంటుంది మోనిత. మరొకవైపు శౌర్య, ఇంద్రమ్మ దంపతులు ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అప్పుడు ఇంద్రమ్మ, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని అడగగా ఉన్నాయిలే ఇంద్రమ్మ నువ్వు పదే పదే అడగకు అని అంటాడు ఇంద్రుడు. అప్పుడు సౌర్య అక్కడికి వచ్చి వారితో మాట్లాడుతూ ఉంటుంది.