Karthika Deepam: తెలుగు బుల్లితెర పై ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటూ దూసుకుపోతోంది. ఇక ఈరోజు ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. గత ఎపిసోడ్ లో మోనిత ఎలా అయినా కార్తీక్ ని సొంతం చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటుంది.
ఈరోజు ఎపిసోడ్ లో కార్తీక్ పేరుకే భర్తగా ఉన్నాడు కానీ ఇప్పటివరకు మేము దగ్గరగా కలిసింది లేదు అని అనుకుంటూ ఎలా అయినా కార్తీక్ ని దగ్గర చేసుకోవాలి అని ఉంటూ ఉంటుంది మోనిత. అప్పుడు చెయ్యి కాలకపోయినా కూడా చెయ్యి కాలింది అంటూ కార్తీక్ కీ దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు కార్తీక్ లో పెద్దగా రియాక్షన్స్ ఏమీ రాకపోయేసరికి మోనిత నెమ్మదిగా డ్రామా చేయడం మొదలు పెడుతుంది.
అప్పుడు కార్తీక్ నాకు నీ మీద ఎటువంటి ఫీలింగ్స్ రావడం లేదు అని అనగా.. వెంటనే మోనిత దొంగ ఏడుపులు ఏడుస్తూ నేను నీ కోసం ఏం వదులుకున్నానో తెలుసా? ఎంత చేశాను తెలుసా అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతున్నట్టు నటిస్తుంది. మనకు బిడ్డ కూడా ఉన్నాడు అంటూ మోనిత కార్తీక్ ని ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక మోనిత మాటలు నిజం అని నమ్మిన కార్తీక్ మోనిత ను దగ్గర తీసుకుంటాడు.
మరొకవైపు దీప,వాళ్ళ డాక్టర్ అన్నయ్యకు వాళ్ళ అమ్మకు భోజనం వడ్డిస్తూ ఉండగా, అప్పుడు అతను వంటలు బాగా ఉన్నాయి అంటూ దీప ను పొగుడుతాడు. అప్పుడు దీప,కార్తీక్ ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ అన్నయ్య దీపకు ఒక మంచి ఐడియా ఇస్తాడు. నువ్వు నీ భర్తకు వంట వండి పెట్టు కచ్చితంగా నీ భర్త గుర్తుపడతాడు. నీకు మేము తోడుగా ఉన్నాము అంటూ దీపకు ధైర్యం చెబుతారు.
ఆ తర్వాత వారణాసి,ఇంద్రమ్మ ఇద్దరు మాట్లాడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శౌర్య వస్తుంది. నేను కూడా వారణాసితో కలసి ఆటోలు వెళ్లి అమ్మా నాన్నలను వెతుకుతాను అని అంటుంది. అప్పుడు ఇంద్రమ్మ దంపతులు ఎక్కడ అని వెతుకుతావు అని అనగా శౌర్య మాత్రం పట్టు పట్టి కార్తీక్ దీప,లను వెతకడానికి వారణాసి తో పాటు ఆటోలో వెళుతుంది. ఆ తర్వాత కార్తీక్, మోనిత మాట్లాడుతూ ఉండగా ఇంతలో శివని పిలిచి శివ మనం బయటికి వెళ్దామా అని అంటాడు.
అప్పుడు మోనిత ఎక్కడికి కార్తీక్ అని అడగడంతో నీకు ఒక సర్ప్రైజ్ మోనిత అని అంటాడు కార్తీక్. అప్పుడు కార్తీక్ మోనిత తనతో అన్న మాటలు అన్నీ కూడా రిపీట్ చేస్తాడు. అప్పుడు మోనిత చిన్న అబద్ధం వల్ల నా మీద ఇంత ప్రేమ వచ్చిందా అంటూ లోపల సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ నేను వెళ్లి వంటలక్కని తీసుకొని వస్తాను మన ఇంట్లో పనిమనిషిగా అని చెప్పగా మోనిత మాత్రం దానికి అస్సలు ఒప్పుకోదు. అప్పుడు మోనిత అది మనల్ని అసలు మనశ్శాంతిగా ఉండనివ్వదు.
అది కనీసం మన దరిదాపుల్లోకి రానివ్వడానికి కూడా నేను ఒప్పుకోను అని అంటుంది. అందుకు కార్తీక్ తాను కాకపోతే వేరే వాళ్ళనైనా తెచ్చుకుందాం అని అంటాడు. అప్పుడు మోనిత తన మనసులో దీప ఎలా అయినా కార్తీక్ కనిపించకుండా చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. మరొకవైపు దీప డాక్టర్ బాబు కోసం వంటలక్కగా మారాలి అనుకొని వాళ్ళ డాక్టర్ అన్నయ్య ఇంటి నుంచి బయలుదేరింది.